Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ కు ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని సాయి పల్లవి డాన్స్ పై రాహుల్ రవీంద్ర ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ అద్భుతంగా చేసిందని, కేవలం ఆమె డాన్స్ కోసమే ఈ సినిమాను 20 సార్లు చూశానని ఈ సందర్భంగా రాహుల్ రవీంద్ర ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ కి సాయిపల్లవి స్పందిస్తూ.. ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ సాయి పల్లవి డ్యాన్స్‌తోనే ఓ పూర్తిస్థాయి సినిమాని ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబ సభ్యులే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే సున్నితమైన విషయాన్ని తీసుకొని ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు కథ అవసరం లేదని, సాయి పల్లవి డాన్స్ ఒక్కటే చాలని ఈ సందర్భంగా సాయి పల్లవి డాన్స్ పై రాహుల్ రవీంద్ర ప్రశంసలు కురిపించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…