Chiranjeevi : ఆ రోజు అస‌లు నిద్ర‌పోలేదు.. వ‌ణికిపోయాన‌ని చెప్పిన చిరంజీవి..!

October 9, 2022 3:26 PM

Chiranjeevi : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిరంజీవి రేంజ్ కు తగ్గట్లు ఉంది. గాడ్ ఫాదర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మెగాభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మూడో రోజు వరల్డ్ వైడ్‌గా గాడ్ ఫాదర్ సినిమా రూ.7.01 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. మొత్తం మూడు రోజుల‌కు క‌లిపి రూ.34.36 కోట్ల‌ షేర్ వ‌సూళ్లను సొంతం చేసుకుంది. గ్రాస్ ప‌రంగా చూస్తే రూ.62.55 కోట్లు రాబట్టుకుంది అంటూ సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

గాడ్ ఫాదర్ మూవీ విజయాన్ని అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై సురేఖా ఏమన్నారని చిరంజీవిని యాంకర్ సుమ ప్రశ్నించింది. నా కంటే ఎక్కువగా సురేఖ టెన్షన్ పడింది. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్న కూడా రిలీజ్‌కు సాయంత్రం నుంచి సురేఖ చాలా డల్‌గా ఉంది. ఆ సమయంలో సురేఖను చూసి నేను కాస్త డల్ అయ్యానని చిరంజీవి చెప్పడం జరిగింది. ఈ సినిమాపై నేను ఎంతో నమ్మకంగా ఉన్నా, గతంలో హిట్ అవుతాయి అనుకున్న  సినిమాలు ఆడకపోవడంతో ఏమో ఏమవుతోందని సురేఖలో భయం ఏర్పడింది. తన భయం చూసి నేను కూడా భ‌య‌పడాల్సి వచ్చింది అంటూ చిరంజీవి సుమ‌ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.

Chiranjeevi said he worried very much before Godfather release
Chiranjeevi

ఆ రోజు రాత్రి నేను సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని అస్సలు నిద్రపోలేకపోయాను. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ తో వణికిపోయాను. సినిమా విడుదలైన రోజు ప్రసాద్ లండన్ నుంచి ఫస్ట్ కాల్ చేసి సినిమా బాగుందని చెప్పారు. ఆ తరువాత వరుసగా కాల్స్ రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి సినిమా కూడా ప్రాణం పెట్టి తీస్తాం. కానీ ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయన్నది కాదు.. ఎంతమంది ప్రేక్షకులకు సినిమా నచ్చింది అన్నదే ముఖ్యం అంటూ చిరంజీవి సక్సెస్ మీట్ లో వెల్లడించారు.

గాడ్ ఫాదర్ సినిమా ఇంద్ర, ఠాగూర్ ఆ రేంజ్ సినిమాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాను బ్లాక్‌బస్టర్ అని చెబుతున్నారు.  కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం సినిమాలు నిరూపించాయి. మేము కూడా అదే నమ్మకంతో ఈ సినిమా కోసం కృషి చేశాం. ఈ సినిమా కోసం ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లను ముందుగా పరిశీలించాం. చివరికి రామ్ చరణ్, ప్రసాద్ డైరెక్టర్ మోహన్ రాజా పేరును సూచించడం జరిగింది. ఆ తరువాత టీమ్ అంతా కూర్చొని సెట్ చేశారంటూ చిరంజీవి సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now