Chiranjeevi Pawan Kalyan : మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌..? చిరంజీవితో కలసి నటించనున్న పవన్‌..?

November 7, 2021 10:06 AM

Chiranjeevi Pawan Kalyan : ఆరుప‌దుల వ‌యస్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా త‌న 154వ సినిమాను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో మూవీ లాంచింగ్‌ కాగా, దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. పూరీ జగన్నాథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Chiranjeevi Pawan Kalyan may act together in a movie

లాంచింగ్ త‌ర్వాత చిత్రం నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, అందులో మాస్‌ అవతారంతో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేసేలా పోస్టర్‌ని సిద్ధం చేశారు. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ప‌లు వార్త‌లు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. చిత్రంలో కీల‌క పాత్ర ఉండ‌గా, ఆ పాత్ర‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని అనుకుంటున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

వైజాగ్ పోర్ట్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ యాక్ష‌న్ డ్రామాలో చిరంజీవి వీర‌య్య పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న సోద‌రుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్టు టాక్. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు బాబీ గ‌తంలో ప‌వ‌న్‌తో క‌లిసి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ప‌వ‌న్‌ని క‌లిసి పాత్ర గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడ‌ట బాబీ. పాత్ర న‌చ్చ‌డంతో చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ఇది క‌నుక నిజ‌మైతే ప‌వ‌న్ అభిమానుల‌కి పూన‌కాలే అని చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now