Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ కలిసి ఫుల్ లెంగ్త్‌లో నటించిన చిత్రం.. ఆచార్య. ఈ సినిమాకు కొరాటల శివ దర్శకత్వం వహించగా.. ఈ నెల 29వ తేదీన ఈ మూవీని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు గాను ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా ఆచార్య సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
కాగా ఈ మూవీ లోంచి భలే భలే బంజారా అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ ప్రమోషనల్ వీడియోను లాంచ్ చేశారు. అందులో రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ సరదాగా ముచ్చటించారు. ఇక ఓ సందర్భంలో చిరు.. చరణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. నన్నే డామినేట్ చేద్దామని అనుకుంటున్నావా ? కాస్త తగ్గు.. అంటూ చిరంజీవి.. చరణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక ఈ మూవీలో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డెలు హీరోయిన్లుగా నటించారు. ధర్మస్థలి అనే గ్రామం నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…