Tiger Nageshwar Rao : టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు కోసం.. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన స్టూవ‌ర్ట్‌పురం..!

Tiger Nageshwar Rao : ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం.. టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు. ఈ సినిమాను బందిపోటు దొంగ నాగేశ్వ‌ర్ రావు బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ర‌వితేజ త‌న లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఇక 1970ల‌లో స్టూవ‌ర్ట్ పురంలో జరిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇందుకు గాను ఓ భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు.

Tiger Nageshwar Rao

నాని న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రానికి ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన అవినాష్ కొల్ల హైద‌రాబాద్‌లో కోల్‌క‌తా సెట్ వేసి మెప్పించారు. అచ్చం కోల్‌క‌తాలో అప్ప‌ట్లో ఉన్న‌ట్లే ఆ సినిమాలో చూపించారు. చాలా స‌హ‌జ‌సిద్ధంగా సెట్ వేశారు. దీంతో ఆయ‌నే ఇప్పుడు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావుకు కూడా ప‌నిచేస్తున్నారు. అందుకు గాను ఆయ‌న హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో భారీ విస్తీర్ణంలో సెట్ నిర్మిస్తున్నారు. 1970ల‌లో స్టూవర్ట్‌పురం ఎలా ఉండేదో.. అచ్చం అలాగే స‌హ‌జ‌సిద్ధంగా సెట్‌ను రూపొందిస్తున్నారు.

ఇక హైదరాబాద్ శివారు ప్రాంత‌మైన శంషాబాద్‌లో ఏకంగా 5 ఎక‌రా స్థ‌లాన్ని ఇందుకు లీజ్‌కు కూడా తీసుకున్నారు. అక్క‌డే స్టూవ‌ర్ట్‌పురం సెట్ వేస్తున్నారు. దానికి అవినాష్ ప‌నిచేస్తున్నారు. ఇక కేవలం ఈ సెట్ వేసేందుకే మేక‌ర్స్ రూ.7 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. దీంతో చాలా ప‌క‌డ్బందీగా.. అత్యున్న‌త స్థాయి ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో ప‌నిచేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు మూవీ పాన్ ఇండియా సినిమా క‌నుక పెట్టిన బ‌డ్జెట్ క‌చ్చితంగా వ‌చ్చి తీరుతుంద‌ని ఆశిస్తున్నారు. దీనికి జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. ఆర్ మాధే సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM