Chiranjeevi : రామ్ చ‌ర‌ణ్‌కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. ఎందుకు..?

April 16, 2022 10:26 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ క‌లిసి ఫుల్ లెంగ్త్‌లో న‌టించిన చిత్రం.. ఆచార్య‌. ఈ సినిమాకు కొరాట‌ల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఈ నెల 29వ తేదీన ఈ మూవీని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకు గాను ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. కాగా ఆచార్య సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన టీజ‌ర్‌, సాంగ్స్‌, పోస్ట‌ర్స్ అన్నీ ప్రేక్ష‌కులను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి.

Chiranjeevi given warning to Ram Charan know why
Chiranjeevi

కాగా ఈ మూవీ లోంచి భ‌లే భ‌లే బంజారా అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియోను లాంచ్ చేశారు. అందులో రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి ఇద్దరూ స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఇక ఓ సంద‌ర్భంలో చిరు.. చ‌ర‌ణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. న‌న్నే డామినేట్ చేద్దామ‌ని అనుకుంటున్నావా ? కాస్త త‌గ్గు.. అంటూ చిరంజీవి.. చ‌ర‌ణ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ మూవీలో చిరంజీవి ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న పూజా హెగ్డెలు హీరోయిన్లుగా న‌టించారు. ధ‌ర్మ‌స్థ‌లి అనే గ్రామం నేప‌థ్యంలో సినిమా క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. దీనికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment