Chiranjeevi : మెగా అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. చేతికి క‌ట్టుతో క‌నిపించిన చిరంజీవి.. ఎక్క‌డ గాయ‌ప‌డ్డారు ? ఎలా గాయాలు అయ్యాయి ?

October 17, 2021 5:47 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ‌య‌స్సులోనూ కుర్ర హీరోల‌కు పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు. సినిమాల‌తోనే కాకుండా సేవా కార్య‌క్ర‌మాల‌తోనూ చిరు ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలందించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

Chiranjeevi appeared with bandage how he got wounds

క్రైసిస్ స‌మ‌యంలో అభిమానులు ముందుకొస్తారా ? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండగా నిలవడం ఎనలేని ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. అనుకున్న‌దే ఆల‌స్యం.. వారంలోనే ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానులదే. దుబాయ్.. గుజరాత్.. వైజాగ్ లాంటి చోట్ల ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఆక్సిజన్ యంత్రాల్ని తయారు చేయించాం. 3000కు పైగా సిలిండర్లు తయారు చేయించాం. కానీ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాం. చాలా శ్రమించాం.. అని తెలిపారు చిరంజీవి.

అయితే చిరంజీవి త‌న అభిమానుల‌తో మీటింగ్‌కి వ‌చ్చిన స‌మ‌యంలో చేతికి క‌ట్టుతో క‌నిపించారు. చిరు చేతికి ఉన్న క‌ట్టు చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఏమైంద‌ని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం చిరంజీవి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారా.. అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment