Nagababu : చిరంజీవి, ప‌వ‌న్‌ల ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్న నాగ‌బాబు..?

October 10, 2022 7:59 AM

Nagababu : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. అయితే సెన్సేషన్ ఏదైనా.. సిచువేషన్‌ ఎలాంటిదైనా.. ఓన్ చేసుకుంటారు నాగ‌బాబు.

చివరకు దాన్ని వివాదాస్పదంగా మారుస్తాడు. అన్నింటిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తాడు. అది కాస్తా ఇష్యూగా మారాక.. వివరణ ఇచ్చుకుంటాడు. మెగా బ్రదర్ నాగబాబుకు ఇది కామన్‌గా మారింది. తాజాగా గరికపాటి, మెగాస్టార్ ఇష్యూలో కూడా సేమ్‌ సీన్. చిన్న విషయాన్ని.. తన ట్వీట్‌తో పెద్దదిగా చేశాడు. చివరకు వివాదాస్పదంగా మార్చాడు. చిరు, గరికపాటి గొడవలో.. నాగబాబు రోల్ ఏంటి..? ఆయన వల్ల మెగా ఫ్యామిలీకి ఒరిగిందేంటి..? అటు అన్నయ్య సినిమాల్లో.. ఇటు తమ్ముడు రాజకీయాల్లో.. ఇద్దరూ సక్సెస్‌ ఫుల్‌ జర్నీలో ఉన్నారు.

chiranjeevi and pawan kalyan image damaging because of Nagababu
Nagababu

ఈ ఇద్దరి మధ్యలో ఉన్న మిడిల్ బ్రదర్ నాగబాబు మాత్రం సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా స్మాల్ స్క్రీన్‌పై మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్‌లో ఆయన నవ్వులకు ఫిదా కాని వారెవ్వరుండరు. అలాంటి నాగబాబు మాత్రం ఎప్పుడూ ఏదో వివాదంపై స్పందిస్తూ ఉంటాడు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి మధ్య జరిగిన చిన్న విషయంలో తాను ఎంటరై ఇష్యూగా మార్చేశాడు. రచ్చ రచ్చ చేశాడు. ఎప్పట్లాగే మళ్లీ తానే వివరణ ఇచ్చుకున్నాడు. అయితే మెగా బ్రదర్ ఒక ట్వీట్ పెట్టకముందే, మెగా అభిమానులు అవధానిని పెద్దగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే నాగబాబు హైలైట్ చేయడంతో మీడియాకు వార్తగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now