గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Carom Seeds For Gas Trouble : వీటిని ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. క్ష‌ణాల్లో గ్యాస్ మాయం అవుతుంది..!

Carom Seeds For Gas Trouble : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గ్యాస్ సమస్య నూనెలో వేయించిన ఆహార పదార్థాలను…

Carom Seeds For Gas Trouble : వీటిని ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. క్ష‌ణాల్లో గ్యాస్ మాయం అవుతుంది..!

Carom Seeds For Gas Trouble : చాలామంది, అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గ్యాస్ సమస్య నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన వస్తుంది. అలానే, జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా, కలుగుతూ ఉంటుంది. చాలామంది, బాగా స్పైసీ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు. స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, కారం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వలన గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది.

చాలా మంది గ్యాస్ ని తగ్గించుకోవడానికి, మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే, గ్యాస్ సమస్య నుండి బయటపడడానికి, ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది. గ్యాస్ ని మొదట్లోనే తగ్గించుకోవడానికి చూసుకోండి. ఇక ఇప్పుడు, ఇంటి చిట్కాలతో ఎలా గ్యాస్ సమస్య నుండి బయట పడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, వామును ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Carom Seeds For Gas Trouble take them daily one spoon
Carom Seeds For Gas Trouble

ఆయుర్వేదంలో కూడా, వాముని బాగా వాడతారు. ఆయుర్వేద ఔషధ గుణాలు ఉంటాయి. శరీరంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి వాము బాగా సహాయం చేస్తుంది. అర స్పూన్ వాములో, చిటికెడు రాక్ సాల్ట్ వేసుకుని బాగా దంచి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నమిలి, వచ్చే రసాన్ని మింగాలి. ఇది కొంచెం వగరుగా, చేదుగా ఉంటుంది. కానీ, తీసుకుంటే గ్యాస్ సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

కడుపునొప్పి కూడా పోతుంది. దీనిని తీసుకున్నాక, ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి. గ్యాస్ బయటకు పోయి కడుపునొప్పి బాగా తగ్గిపోతుంది. పురాతన కాలం నుండి, వాముని అజీర్తి సమస్యలకి వాడుతున్నారు. రాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే, రాక్ సాల్ట్ పేగు కదలికలని కూడా ప్రోత్సహిస్తుంది. ఆకలని కూడా ఇది బాగా తగ్గిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.