Viral Video : వివాహ బంధం అనేది ఎంతో అపురూపమైన బంధం. రెండు మనసులు ఒకటయ్యే ఈ అపురూప వేడుక లో పెళ్లనేది ఎంతో సంబరంగా జరుపుకునే వేడుకగా మారింది. నూతన జీవితాన్ని ప్రారంభించబోయే సందర్భాల్లో జీవితాంతం గుర్తుండేలా వధూవరులు కొత్త కొత్త పనులు చేస్తారు. ఇక పెళ్లిళ్లలో బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే మోతలు, అదిరిపోయే సంగీతం, బంధువుల డాన్సులతో పెళ్లిలో ఉండే ప్రతి ఒక్కరూ సందడి చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పటి జనరేషన్ బాగా ఫాస్ట్ గా ఉంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ పెళ్లి ఫంక్షన్స్ లో ఆనందంగా గడిపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు డ్యాన్స్ లు చేస్తూ చూసేవాళ్లని ఆకట్టుకుంటున్నారు . ప్రస్తుతం ఇలాంటి పెళ్లి వీడియోలు నెట్టింట్లో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫంక్షన్స్ లో వధువులు చేసే డాన్సులు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. కొందరు నవ వధువులు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అయిపోతున్నారు. ప్రస్తుతం ఓ వధువు డాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. చూసే వారందరూ మైమరచిపోయేలా పెళ్లి రిసెప్షన్ లో సందడి చేస్తూ డాన్స్ స్టెప్పులతో స్టేజ్ ని షేక్ చేసింది. ఆ వధువు చేసిన ఈ డాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న టైంలో చూడముచ్చటగా ముస్తాబైన వధువు డాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
వధువు ఎరుపు అంచు కలిగిన గోల్డ్ కలర్ పట్టుచీరలో, వరుడు కూడా బ్లూ కలర్ సూట్‌లో ఈ జంట చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు. రిసెప్షన్ వేడుకకు బంధువులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు ఉన్నట్టుండి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. బంగారం బంగారం బుల్లెట్ ఎక్కి వచ్చేయ్ రా అనే పాటకు డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. అది చూసిన వరుడు.. భార్య చేసే డాన్స్ కి ముసిముసి నవ్వులతో తెగ మురిసిపోయాడు. అతనిని కూడా డ్యాన్స్ చేయాలంటూ ఎవరో అతన్ని ముందుకు తోయగా, అతను సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా లక్షల్లో లైక్స్ లు వచ్చాయి. అందరూ నవ వధువు డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…