Symbol : మన దేశంలో జాతకాల మీద, సెంటిమెంట్స్ మీద నమ్మకం ఉండేవారు చాలామందే వుంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. పూర్వకాలంలో నాడీజాతకం బాగా ప్రాముఖ్యత పొందింది. చేతి నాడి పట్టుకుని వర్తమాన, భవిష్యత్తు కాలాలను జ్యోతిష్యులు వెల్లడించే వారు. ప్రస్తుతం హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటున్నారు. మీ రెండు అర చేతులను ఓ సారి చూసుకుంటే మధ్యలో అనేక రేఖలు కనిపిస్తాయి. హస్తసాముద్రికం ప్రకారం,ఈ రేఖలు, చిహ్నాలు వ్యక్తి స్వభావం, విద్య, వృత్తి, ఆర్థిక, వైవాహిక జీవితం గురించి తెలియజేస్తాయి. అలాగే కొన్ని గీతలు, చిహ్నాలు ఉండటం వ్యక్తి యొక్క అదృష్టాన్ని కూడా సూచిస్తుంది.
హస్తసాముద్రికం ప్రకారం కొన్ని అరుదైన గీతలు చాలా తక్కువ మంది వ్యక్తుల చేతుల్లో కనిపిస్తాయి. ఈ గీతలు కలిగి ఉన్న వ్యక్తులు వారి జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధిస్తారని నమ్ముతారు. ఎప్పుడైనా మీ చేతిలో రేఖలపై X ఆకారం వంటి గీతలు గమనించారా..? దీని వలన మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతులపై రెండు గీతల మధ్య స్పష్టమైన X ఆకారం వంటి గీతలు ఉన్నవారిని సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులుగా పిలుస్తారు. ఎక్కడ చేయి పెడితే అక్కడ బంగారం పుడుతుందని, వారు అన్ని కార్యకలాపాలలోనూ విజయం సాధిస్తారని నమ్మకం. అలాంటి వ్యక్తులకు పదునైన మనస్సు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు ఏదైనా పనిని చాలా సులభంగా నేర్చుకోగలరు.
అంతేకాకుండా తమ కెరీర్‌లో ఆశించిన స్థానాన్ని సాధించగలరు. మరోవైపు రెండు అరచేతులపై x ఆకారం గీతలు ఉన్న వ్యక్తి సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టిస్తారు. మరణం తర్వాత కూడా అందరిలోనూ గొప్పగా గుర్తింపు తెచ్చుకుంటారు. దీంతోపాటు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఏం చేసినా కలసి వస్తుందట. ధనం, ఆరోగ్యం అన్నీ కలుగుతాయట.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…