Viral Video : స్టేజిపై వ‌ధువు అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేస్తుంటే.. వ‌రుడు ఎలా చూస్తున్నాడో చూడండి.. వీడియో..

September 18, 2022 7:51 AM

Viral Video : వివాహ బంధం అనేది ఎంతో అపురూపమైన బంధం. రెండు మనసులు ఒకటయ్యే ఈ అపురూప వేడుక లో పెళ్లనేది ఎంతో సంబరంగా జరుపుకునే వేడుకగా మారింది. నూతన జీవితాన్ని ప్రారంభించబోయే సందర్భాల్లో జీవితాంతం గుర్తుండేలా వధూవరులు కొత్త కొత్త పనులు చేస్తారు.  ఇక పెళ్లిళ్లలో బరాత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే మోతలు, అదిరిపోయే సంగీతం, బంధువుల డాన్సులతో పెళ్లిలో ఉండే ప్రతి ఒక్కరూ సందడి చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు.  ప్రస్తుతం ఇప్పటి జనరేషన్ బాగా ఫాస్ట్ గా ఉంది.  చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ పెళ్లి ఫంక్షన్స్ లో ఆనందంగా గడిపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు డ్యాన్స్ లు చేస్తూ చూసేవాళ్ల‌ని ఆకట్టుకుంటున్నారు . ప్రస్తుతం ఇలాంటి పెళ్లి వీడియోలు నెట్టింట్లో బాగా హల్‌చ‌ల్‌ చేస్తున్నాయి. పెళ్లి ఫంక్షన్స్ లో వధువులు చేసే డాన్సులు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. కొందరు నవ వధువులు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రెటీలు అయిపోతున్నారు. ప్రస్తుతం ఓ వధువు డాన్స్ సోషల్ మీడియాలో  హంగామా సృష్టిస్తోంది. చూసే వారందరూ మైమరచిపోయేలా  పెళ్లి రిసెప్షన్ లో సందడి చేస్తూ డాన్స్ స్టెప్పులతో స్టేజ్ ని షేక్ చేసింది. ఆ వధువు చేసిన ఈ డాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న టైంలో చూడముచ్చటగా ముస్తాబైన వధువు డాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

bride dance on stage Viral Video groom see
Viral Video

వధువు ఎరుపు అంచు కలిగిన గోల్డ్‌ కలర్‌ పట్టుచీరలో, వరుడు కూడా బ్లూ కలర్‌ సూట్‌లో ఈ జంట చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు. రిసెప్షన్ వేడుకకు బంధువులు అందరూ  హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు ఉన్నట్టుండి ఎంతో ఉత్సాహంగా డాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. బంగారం బంగారం బుల్లెట్ ఎక్కి వచ్చేయ్ రా అనే పాటకు డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.  అది చూసిన వరుడు.. భార్య చేసే డాన్స్ కి  ముసిముసి నవ్వులతో తెగ మురిసిపోయాడు. అతనిని కూడా డ్యాన్స్ చేయాలంటూ ఎవరో అతన్ని ముందుకు తోయ‌గా, అతను సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించగా లక్షల్లో లైక్స్‌ లు వచ్చాయి. అందరూ నవ వధువు డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now