Koratala Siva : ఒక సినిమా తెరపైకి రావాలంటే కేవలం కావాల్సింది నటీనటులు మాత్రమే కాదు. సినిమా తెరకెక్కించడానికి అవసరమైన కథ చిత్రానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రచయిత పవర్ ఫుల్ కథాంశాన్ని అందించినప్పుడు మాత్రమే దర్శకుడు అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడు. ఒక్కోసారి దర్శకుడు తన చిత్రానికి కథ స్వయంగా రాయడం జరుగుతుంది. మరికొన్ని చిత్రాలకు దర్శకుడు, రచయిత వేరువేరుగా ఉంటారు.
దర్శకుడే స్వయంగా కథ రాసుకున్నప్పుడు సినిమా టైటిల్స్ వేసే సమయంలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటూ వారి పేరు తెరపై చూపించడం జరుగుతుంది. కానీ చిత్రానికి దర్శకుడు, రచయిత వేరువేరుగా ఉన్నప్పుడు కేవలం తెరపై డైరెక్టర్ పేరు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ చిత్రానికి రచయిత ఎవరు అనేది కొన్ని సమయాలలో తెరపై చూపించడం జరగదు. సినిమా టైటిల్స్ వేసే సమయంలో ఎప్పుడైతే రచయిత పేరు కనిపించదో ఆ రచయితకు అన్యాయం జరిగినట్లు అవుతుంది. ఒక రచయితకు ఉండే ప్రత్యేక గుర్తింపు అనేది జనాలకు తెలియకుండా పోతుంది. అలా చాలా మంది రచయితలు తమ పేరు టైటిల్స్ లో వేయలేదని ఇంటర్వ్యూల ద్వారా చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ కూడా ఒకప్పుడు రచయితగా పలు సినిమాలకు కథలను అందించారు. కొరటాల శివ సినిమాలపై ఉన్న ఆసక్తితో స్వయానా తన మేనమామ పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతే కాకుండా పలు చిత్రాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా మున్నా, బృందావనం, ఒక్కడున్నాడు సహా పలు చిత్రాలకు పనిచేశారు.
2013లో కొరటాల శివ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రమైన మిర్చితో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కొరటాల శివ. మిర్చి చిత్రం సక్సెస్ తో కొరటాల ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకున్నాడు. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో కొరటాల శివ మొదటి సారిగా ఫ్లాప్ ను చవిచూశారు.
కొరటాల శివ ఓ ఇంటర్వ్యూ ద్వారా తాను సింహా సినిమాకు రచయితగా పనిచేశానని చెప్పారు. కానీ తన పేరును టైటిల్స్ లో వేయలేదని, ఆ విషయం ఆయనను ఎంతో బాధ పెట్టిందని కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను దర్శకుడిగా అవ్వడానికి అది కూడా ఒక కారణం అయ్యిందని తెలియజేశారు. అదేవిధంగా తన మేనమామ పోసాని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని ఆయన ఒక పనిరాక్షసుడు, ఆయన దగ్గర పనిచేసిన శిష్యులందరూ కూడా ప్రస్తుతం డైరెక్టర్లగా, రచయితలుగా మంచి స్థాయిలో ఉన్నారని.. పోసాని గురించి ఎంతో గొప్పగా చెప్పారు కొరటాల శివ.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…