ETV Prabhakar : టీవీ నటుడు ప్రభాకర్ ఇటీవల తెగ పాపులర్ అయిపోయాడు. దానికి కారణం ఆయన కుమారుడు చంద్రహాస్. కొన్నిరోజుల క్రితం చంద్రహాస్ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి, తన కొడుకు కొత్త సినిమాల గురించి ప్రభాకర్ ప్రకటించాడు. అయితే ఈ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించాడని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. దీంతో చంద్రహాస్ గురించి ఏ చిన్న వార్తొచ్చినా సరే నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ గురించి నటుడు ప్రభాకర్.. ఎవరికీ తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
మీడియా ముందు ఎలా మెలగాలో నా కొడుక్కి ఇంకా తెలియదని.. మెల్లమెల్లగా అన్నీ వాడే నేర్చుకుంటాడని అన్నాడు. తన కుమారుడి గురించి చెబుతూ మా వాడికి బ్రాండ్ పిచ్చి బాగా ఉంది. నాకు అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. ఏదో ఒకటి వేసుకుందామని అనుకుంటానని అన్నాడు. కానీ మా వాడు మాత్రం బ్రాండ్ దుస్తులు వేసుకుంటాడు అని చెప్పాడు. తనకు ఏ గాడ్జెట్ అయినా వస్తువైనా బ్రాండెడ్ ఉండాలని కోరుకుంటాడని తెలిపాడు. అంతేకాకుండా ఓసారి అమెరికా నుంచి వాచ్ తీసుకు వస్తే ఇది బ్రాండ్ కాదు అంటూ పక్కన పడేశాడని తెలిపాడు.
వస్తువును చూడగానే అది బ్రాండా కాదా అనే విషయంలో ఇప్పటి పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తారని అన్నాడు. అంతేకాకుండా మంచో చెడో సినిమా చేయకుండానే చంద్రహాస్ కు చాలా పాపులారిటీ వచ్చిందని చెప్పాడు. ఎంతో డబ్బులు ఖర్చు పెడితే కానీ ఇలాంటి ప్రచారం జరగదని అన్నాడు. ప్రస్తుతం చంద్రహాస్ రెండు వేర్వేరు బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడని ఓ సినిమా తన సొంత బ్యానర్ లో చేస్తున్నాడని చెప్పాడు. చంద్రహాస్ ఇంట్లో నుండి రూ.10 లక్షలు తీసుకుని ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్ చేయగా ఆ సాంగ్ చూసి సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…