Cashew Vs Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పు.. రెండింటిలో ఏది మంచిది.. దేన్ని తింటే మ‌న‌కు మేలు జ‌రుగుతుంది..!

Cashew Vs Almonds : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడి తమ చేతులారా అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఏ ఆహారాన్ని తీసుకోవడం వలన మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. శరీరంలో ఎప్పుడైతే పోషకాహారలోపం ఏర్పడుతుందో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మరి ఇలా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి పోషకాలు ఉన్న ఆహారం అందించడం ఎంతో అవసరం.

మన శరీరానికి కావలసిన మంచి పోషకాలు అందించడంలో డ్రైఫ్రూట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో నట్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా వాడేవి బాదం, జీడిపప్పు. ఈ రెండింటిలోనూ గ్లూటెన్ లేకుండా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

Cashew Vs Almonds

బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర గింజలతో పోలిస్తే బాదంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బాదం పప్పు బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. బాదం పప్పును రెగ్యులర్ గా తినటం వలన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, మధుమేహ లక్షణాలు తగ్గించటానికి, మానసిక ఒత్తిడి తగ్గించటానికి సహకరిస్తుంది.

జీడిపప్పు తినటానికి రుచిగా ఉండటమే కాదు.. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో 82 శాతం కొవ్వుతోపాటు ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఈ ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్ లో 66 శాతం గుండెకు రక్షణ కల్పించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఐరన్ రక్త కణాలకు ఆక్సిజన్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  అంతేకాకుండా రక్తహీనతను నివారిస్తుంది. ఇక మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల‌ను నివారించడంతోపాటు కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇప్పుడు బాదం మరియు జీడిపప్పు రెండింటిలో ఏది తింటే బెటర్ అనేది చూద్దాం. బాదం పప్పు శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. బాదం పప్పులో అమైనో ఆమ్లాలు ఉండుట వలన వ్యాయమం చేసే సమయంలో కొవ్వులు మరియు క్యాలరీలు బర్న్ చేయటానికి సహాయపడుతుంది. జీడిపప్పులో విటమిన్ కె మరియు జింక్‌ అధికంగా ఉంటుంది.  జీడిపప్పులో కొవ్వు తక్కువగా ఉంటుంది. జీడిపప్పు తినటం వలన బరువు తగ్గటం అనేది జరగదు.

బాదంలో ఫైబర్, విటమిన్ ఇ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. ఈ విషయాలు కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడయ్యాయి. కాబట్టి జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బరువు తగ్గాలని అనుకొనే వారు మాత్రం బాదం పప్పు తినటమే బెటర్ ఆప్షన్ అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM