Bimbisara Movie Child Artist : బింబిసార మూవీలో నటించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా ?

August 6, 2022 8:24 AM

Bimbisara Movie Child Artist : నందమూరి కల్యాణ్‌ తొలి సారిగా చేసిన భారీ బడ్జెట్‌ మూవీ.. బింబిసార. ఈ మూవీని స్వయంగా ఆయనే తన ఎన్‌టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో క్యాథరిన్‌ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. క్రీస్తు పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కథను ఆధారంగా చేసుకుని కల్పిత పాత్రలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో వశిష్ట అనే దర్శకుడు కొత్తగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

అయితే బింబిసార మూవీలో ఓ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నటించింది. ఆమె పేరు శ్రీదేవి. కల్యాణ్‌ రామ్‌ ఉండే రెండు ఎపిసోడ్స్‌ (ఫ్లాష్‌ బ్యాక్‌, ప్రస్తుతం) లలోనూ ఈ చిన్నారి యాక్ట్‌ చేసింది. అయితే ఈమెకు ఇదే తొలి మూవీ కాదు. ఇంతకు ముందు పలు మూవీల్లోనూ నటించింది. రామారావు ఆన్‌ డ్యూటీ, మేజర్‌ వంటి సినిమాలతోపాటు పలు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్‌ చేస్తోంది. ఇక ఈమె తండ్రి శ్రీహరి గౌడ్‌ ఆర్టిస్టు మాత్రమే కాక ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కూడా.

Bimbisara Movie Child Artist Sri Devi wonderful acting
Bimbisara Movie Child Artist

చిన్నారి శ్రీదేవి ఇప్పటి వరకు 15 సీరియల్స్‌, 10 యాడ్స్‌లో నటించింది. బింబిసారతోపాటు పలు మూవీల్లోనూ యాక్ట్‌ చేసింది. అయితే బింబిసార మూవీలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఈమె శాంభవిగా అదరగొట్టేసింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సినిమాలో ఈమె నటనకు అందరూ ఈమెను ప్రశంసిస్తున్నారు. ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఉండే ఈ చిన్నారి తన హావభావాలతోనూ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment