Bigg Boss 5 Telugu : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆ ఇద్దరే..!

October 2, 2021 5:54 PM

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ వారం రోజులుగా ఎంతో రసవత్తరంగా పోట్లాటలు, గొడవల మధ్య జరిగింది. వారం చివరిలో ఎలిమినేషన్ ఘట్టం ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ప్రతివారం హౌస్ నుంచి తప్పకుండా ఒకరు బయటకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సమాచారం కూడా వినిపిస్తోంది.

Bigg Boss 5 Telugu : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆ ఇద్దరే..!

ఈ వారం మొత్తం నామినేషన్ లిస్టు లో సిరి, సన్నీ, కాజల్, అనీ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్, ప్రియ, రవిలు ఉన్నారు. వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు.. అనే విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ వారం రవి, ప్రియ, సన్నీ ఈ ముగ్గురు టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. కనుక వీరు ముగ్గురూ సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా కాజల్, సిరి కూడా సేఫ్ జోన్‌లో ఉన్నారు.

ఇకపోతే నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, లోబో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం కనుక డబల్ ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా లోబో ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లోబోతోపాటు అనీ మాస్టర్ లలో కచ్చితంగా ఎవరో ఒకరు బయటకు రావాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అనీ మాస్టర్ కు తక్కువ పోలింగ్ ఉండడంతో ఈవారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment