Bigg Boss 5 : సిరి తల్లి అన్నదాని గురించి బాధపడకు.. షణ్ముఖ్‌ కు తల్లి ఓదార్పు.. ప్రియాంకకు సోదరి చురకలు..

November 27, 2021 8:11 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్ ఎమోష‌న్స్‌తో నిండిపోయింది. ఫైన‌ల్‌కి మూడు వారాల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ఫ్యామిలీస్‌ని ఇంట్లోకి పంపుతున్న విష‌యం తెలిసిందే. శుక్రవారం ఎపిసోడ్ లో స‌న్నీ తల్లి, ప్రియాంక సోదరి, ర‌వి స‌తీమ‌ణి, కూతురు, ష‌ణ్ముఖ్ తల్లి ఇంట్లో సంద‌డి చేశారు. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో అతడు ఫుల్‌ ఖుషీ అయ్యాడు.

Bigg Boss 5 shanmukh mother comforts him pryankas sister warns her

ఇక ప్రియాంక సింగ్‌ సోదరి మధు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్న ఎందుకు రాలేదని నిలదీసింది పింకీ. నాన్నకు కళ్ల ప్రాబ్లమ్‌ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలబెట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్‌ మీద మాత్రమే ఫోకస్‌ చేయ్‌.. అని హెచ్చరించింది. మాన‌స్‌కి ప‌లు మార్లు సారీ కూడా చెప్పింది. ఎందుకు సారీ చెబుతుందో అత‌నికి అర్ధం కావ‌డం లేదు.

కొద్ది సేప‌టికి ర‌వి ఫ్యామిలీ హౌజ్‌లోకి అడుగుపెట్టగా, వారి రాక‌ని చూసి ఫుల్ ఎమోష‌న‌ల్ అయిపోయాడు ర‌వి. నిత్య త‌న భ‌ర్తకు చెప్పాల్సిన‌వన్ని చెప్పేసింది. మ‌రోవైపు ర‌వి కూతురితో స‌ర‌దాగా గ‌డిపాడు. వియా కూడా తండ్రితోపాటు హౌజ్‌మేట్స్ తో ఎంజాయ్ చేసింది. వెళ్లే ముందు నిత్య క‌న్నీరు పెట్టుకోవ‌డంతో ర‌వి చాలా బాధ‌ప‌డ్డాడు. భార‌మైన హృద‌యంతోనే కూతురిని పంపించాడు.

వియా, నిత్యల రాకతో రవికి ఎక్కడ లేని బలం వచ్చేసినట్టు అయింది. ఇక చివరకు షన్ను తల్లి ఉమా రాణి.. షన్ను బాబు అనుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. అమ్మను చూసి ఫ్రీజ్ పొజిషన్‌లో ఉన్న షన్ను ఎమోషనల్ అవుతాడు. రిలీజ్ అయ్యాక త‌ల్లితో కూర్చొని ప్ర‌శాంతంగా మాట్లాడ‌తాడు. మిగతా కంటెస్టెంట్ల పేరెంట్స్ వచ్చారు. కొన్ని చెప్పారు. అందులో కొన్ని కరెక్ట్ అనిపించాయి. రియలైజ్ అయ్యాం.. బాగుంటామని షన్ను తన తల్లితో చెబుతాడు.

నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా ? సిరితోనా ? అని షన్ను అడుగుతాడు. అందరితో ఉండు.. ఒకరితోనే ఉండకు. ఒక మూలకు వెళ్లి ఒకరితోనే ఉండకు.. అని క్లాస్ పీకేశారు. దీప్తి బాగుంది. నేను అర్థం చేసుకున్నట్టే.. తను కూడా నిన్ను అర్థం చేసుకుంది.. మాకు మంచి పేరు తీసుకొచ్చావ్.. అంతా హ్యాపీ.. అని షన్ను తల్లి ఫుల్ ఖుషీ అయింది.

మోజ్ రూంలో షన్ను, షన్ను తల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎలా ఉంటున్నావో ఇక్కడ కూడా అలాగే ఉంటున్నావ్ అని షన్నుకి భరోసానిచ్చారు. సిరి వాళ్ల అమ్మ అలా అనేసింది.. అంటూ షన్ను చెప్పే ప్రయత్నం చేశాడు. నాకు అర్థం అవుతుంది.. దాని గురించి బాధపడకు.. అని షన్నుకి తల్లి ధైర్యాన్ని ఇచ్చారు. 85 రోజులు ఉన్నాం కదా ? అంటూ షన్ను ఏదో చెప్పబోతాడు.. నీ కోసం నువ్ ఆడు.. అందరితో ఉండు.. బాగా ఎంజాయ్ చేయ్.. అని షన్ను తల్లి చెబుతుంటే సిరి ఎంట్రీ ఇస్తుంది.

ఏంటి ఆంటి.. ఇంకేంటి సంగతులు.. అని అడిగేస్తుంది. గేమ్ గేమ్‌లా చూసుకోండి.. ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి.. అలగడం మానేయండి.. బాగా లేదు.. నవ్వుతూనే ఉండండి.. అప్పుడే బాగుంటుంది.. అని సలహా ఇస్తారు. ఇక రేపటి నుంచి బాగానే ఉంటాం.. వేరే చూస్తారు.. అని సిరి చెబుతుంది. దీంతో ఎపిసోడ్‌కి ముగింపు కార్డ్ ప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment