Bigg Boss 5 : ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలోనూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదట హిందీలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ కాంట్రవర్సీ షో అసలు సౌత్ ఇండస్ట్రీలో క్లిక్కవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఈ షోని సౌత్ ప్రేక్షకులు కూడా మంచిగా ఆదరిస్తూ వస్తున్నారు. తెలుగులో నాలుగు సీజన్స్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకోగా, ఇప్పుడు సీజన్ 5 కొనసాగుతోంది.
బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పుడు అసలు రేటింగ్స్ వస్తాయా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తో మంచి ట్రాక్ క్రియేట్ చేయడంతో ఆ తరువాత జనాల్లోకి ఈజీగానే వెళ్లింది. ఆ తరువాత నాని, నాగార్జున కూడా అదే తరహాలో కొనసాగించారు. సీజన్ 5ని నాగార్జున మంచిగానే నడిపిస్తున్నారు. సెప్టెంబర్ 5న మొదలైన సీజన్ 5 చివరికి వచ్చేసింది.
డిసెంబర్ 19న ఫైనల్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి లేదంటే మరో స్టార్ హీరో హాజరు అవుతాడని టాక్. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఎవరు ఉంటారనే చర్చలు నడుస్తున్నాయి.
శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, సిరి, మానస్, సన్నీ టాప్ 5లో ఉంటారని ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఈ సారి ట్రోఫీ ఎవరు అందుకుంటారో..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…