Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్‌ ఎప్పుడో తెలుసా.. టాప్ 5లో ఉండేది వీరే..!

November 20, 2021 10:21 AM

Bigg Boss 5 : ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లోనూ స‌క్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. మొదట హిందీలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ కాంట్రవర్సీ షో అసలు సౌత్ ఇండస్ట్రీలో క్లిక్కవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఈ షోని సౌత్ ప్రేక్ష‌కులు కూడా మంచిగా ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. తెలుగులో నాలుగు సీజ‌న్స్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకోగా, ఇప్పుడు సీజ‌న్ 5 కొనసాగుతోంది.

Bigg Boss 5 season final date may be held on that day who will be in top 5

బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పుడు అసలు రేటింగ్స్ వస్తాయా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తో మంచి ట్రాక్ క్రియేట్ చేయడంతో ఆ తరువాత జనాల్లోకి ఈజీగానే వెళ్లింది. ఆ తరువాత నాని, నాగార్జున కూడా అదే తరహాలో కొనసాగించారు. సీజ‌న్ 5ని నాగార్జున మంచిగానే న‌డిపిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 5న మొద‌లైన సీజ‌న్ 5 చివ‌రికి వ‌చ్చేసింది.

డిసెంబ‌ర్ 19న ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ కార్య‌క్రమానికి చిరంజీవి లేదంటే మ‌రో స్టార్ హీరో హాజ‌రు అవుతాడ‌ని టాక్. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఎవ‌రు ఉంటార‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

శ్రీరామ్ చంద్ర‌, ష‌ణ్ముఖ్‌, సిరి, మాన‌స్, స‌న్నీ టాప్ 5లో ఉంటార‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. చూడాలి మ‌రి ఈ సారి ట్రోఫీ ఎవ‌రు అందుకుంటారో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment