Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. దీంతో టాస్క్‌లు కూడా చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం హౌజ్‌లో 9 మంది సభ్యులు మాత్రమే ఉండగా, వారు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నడుస్తోంది. ముందుగా ఈ టాస్క్‌లో మానస్ తనకు దక్కిన గొడ్డలి పవర్‌ని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే ! దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు.
ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్‌ను షణ్ముఖ్‌కు ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇది నేను ముందే ఊహించా.. అని సిరి చెప్పడం గమనర్హం. నువ్ ఒక మాట అన్నప్పుడు దానికి స్టిక్ అయ్యి ఉండాలిగా.. నిర్ణయం ఎందుకు మార్చుకున్నావ్ సన్నీ.. అని కాజల్ అడగ్గా.. నువ్ ఆగు.. మానస్‌ని అడిగాలే అని.. అన్నాడు సన్నీ.
మొదటి రౌండ్‌లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్‌లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది. దీంతో ఆమె తొలి కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికైంది. ఇక రవి.. సిరి దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అన్నింటికీ రియాక్ట్ అవుతున్నావ్ అని అడగగా, దానికి సిరి.. ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి.
మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్‌గా తీసుకుంటున్నారు. నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి’ అని హితవు పలికాడు. తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. శ్రీరామ్ ఓ ప్లాన్ వేసి తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం.
రెండో రౌండ్‌లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్‌లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్‌ను చేశాడు. ఈ గేమ్ నియమ నిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అనంతరం కోపాన్ని భరించలేక స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…