Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర మంత్రులపై తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే. అయితే ఆ విషయం చిలికి చిలికి గాలివాన అయింది. ఒక దశలో అది పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం నుంచి పవన్ వర్సెస్ పోసానిగా మారింది.
ఈ క్రమంలోనే పవన్ అభిమానులు కాస్త ముందుకు వెళ్లి పోసాని ఇంటిపై దాడులు చేశారని వార్తలు వచ్చాయి. తరువాత పోసాని మళ్లీ కనిపించలేదు. ఆ వివాదం అంతటితో సద్దు మణిగింది. అయితే అదే సమయంలో ఇండస్ట్రీ మొత్తం తమకు పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని బహిరంగ ప్రకటనలు చేసింది. నిర్మాతలు, నటులు కూడా ఏపీ సీఎం జగన్, మంత్రులను కలిశారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. అయితే వారి ఇబ్బందులపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టిక్కెట్ల ధరలను తగ్గించలేదు. దీంతో ఏపీలో విడుదల అయ్యే సినిమాలపై టిక్కెట్ల రేట్ల ప్రభావం పడుతుందని, నిర్మాతలు, బయ్యర్లు నష్టపోతారని చర్చించుకుంటున్నారు.
ఇక పవన్ కల్యాణ్ సుదీర్ఘ కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాక విడుదలైన సినిమా.. వకీల్ సాబ్. ఈ మూవీ విడుదల సమయంలోనూ పవన్‌కు ఇబ్బందులు వచ్చాయి. ఏపీలో థియేటర్లలో షోల విషయంలో, టిక్కెట్ల ధరల విషయంలో పవన్‌ను ఇరుకున పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆ వివాదం సద్దు మణిగినా.. పవన్ మాత్రం దాన్ని మనస్సులోనే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీకి పవన్ భీమ్లా నాయక్ అడ్డుగా ఉందని అనుకుంటున్నారు.
సంక్రాంతి బరిలో మూడు పెద్ద మూవీలు ఉన్నాయని తెలిసి కూడా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహేష్ తన సర్కారు వారి పాటను వేసవి రిలీజ్‌కు మార్చారు. రేపో మాపో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఫిబ్రవరికి వాయిదా పడుతుందని అనుకుంటున్నారు. ఇక మిగిలింది పవన్ భీమ్లా నాయక్ ఒక్కటే.
ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న విడుదల కానుండగా, భీమ్లా నాయక్‌ను జనవరి 12న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ విడుదల సమయంలో ఇతర పెద్ద మూవీలు ఉంటే ఆర్ఆర్ఆర్ కు వచ్చే కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. అందువల్ల మహేష్ పెద్ద మనస్సు చేసుకుని తన మూవీ విడుదలను మార్పు చేశారని అంటున్నారు. అయితే ప్రభాస్ కూడా రాధేశ్యామ్‌ను ఫిబ్రవరికి వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయని, కానీ పవన్ మాత్రం తన మూవీ విడుదల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
తన వకీల్ సాబ్ మూవీ రిలీజ్ సమయంలోనూ.. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై జరిగిన పరిణామాలపై.. తనను పట్టించుకోని ఇండస్ట్రీకి తాను ఇప్పుడు ఎందుకు ఫేవర్ చేయాలని, ఎవరికి ఏం జరిగితే నాకేంటి ? నా సినిమాలకు, నా వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారా ? ఇప్పుడు నేను ఎందుకు మద్దతు ఇవ్వాలి ? అన్నట్లుగా పవన్ ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ విషయంపై పవన్ అభిమానులు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. పవన్ ఒకే వ్యక్తిత్వం ఉన్నవాడని, ఆయన ఎవరి కోసమూ మారడని.. అంటున్నారు. ఇండస్ట్రీ తన వైపు నిలబడనప్పుడు తనతో ఏం పని ? అని అంటున్నారు. మరి ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ సమస్య నుంచి ఎలా బయట పడుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…