Bigg Boss 5 : తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా రన్ అవుతోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో.. 12వ వారంలోకి అడుగు పెట్టింది. 19 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో ఇప్పటి వరకు 11 మంది ఎలిమినేట్ కాగా, హౌజ్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. అయితే షో మొదలైనప్పుడే హౌజ్‌లో కొన్ని జంటలు ఏర్పడాయి. వారిలో మానస్- ప్రియాంక జంట ఒకటి.
ఆ మధ్య జరిగిన సన్నివేశంలో దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది ప్రియాంక సింగ్. తాజాగా అతడికి ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది అన్‌సీన్ వీడియోలో ప్లే అయింది.
‘నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తోంది. మొదటి రోజు నుంచి నిన్ను చూస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తోంది. ఇది కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు, కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తోంది’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది ప్రియాంక.
ఈ అమ్మడు ఇప్పటికీ మానస్ జపం చేస్తూ అతని జ్ఞాపకాలలో మునిగి తేలుతోంది. గేమ్ ఆడడానికి వచ్చిన ప్రియాంక ఇలా చేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ వారం ఆమెని ఎలిమినేట్ చేయనున్నట్టు సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…