గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : ప్రియాంక ఏంటి, మానస్‌కి అలా ప్ర‌పోజ్ చేసింది.. షాక్‌లో ప్రేక్ష‌కులు..

Bigg Boss 5 : తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా రన్ అవుతోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న…

Bigg Boss 5 : ప్రియాంక ఏంటి, మానస్‌కి అలా ప్ర‌పోజ్ చేసింది.. షాక్‌లో ప్రేక్ష‌కులు..

Bigg Boss 5 : తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని.. ఐదో సీజన్ కూడా రన్ అవుతోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో.. 12వ వారంలోకి అడుగు పెట్టింది. 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది ఎలిమినేట్ కాగా, హౌజ్‌లో ప్ర‌స్తుతం ఎనిమిది మంది మాత్ర‌మే ఉన్నారు. అయితే షో మొద‌లైన‌ప్పుడే హౌజ్‌లో కొన్ని జంట‌లు ఏర్ప‌డాయి. వారిలో మాన‌స్- ప్రియాంక జంట ఒక‌టి.

Bigg Boss 5 priyanka proposed to manas audience shocked

ఆ మ‌ధ్య జరిగిన సన్నివేశంలో దేవుడు నాకు మంచి లైఫ్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్‌. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది ప్రియాంక సింగ్. తాజాగా అత‌డికి ప్రపోజ్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది అన్‌సీన్ వీడియోలో ప్లే అయింది.

‘నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తోంది. మొదటి రోజు నుంచి నిన్ను చూస్తుంటే ఏదో తెలియని పాజిటివ్‌ ఎనర్జీ అనిపిస్తోంది. ఇది కరెక్ట్‌ కాదన్న సంగతి నాకు తెలుసు, కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తోంది’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది ప్రియాంక‌.

ఈ అమ్మ‌డు ఇప్ప‌టికీ మాన‌స్ జపం చేస్తూ అత‌ని జ్ఞాప‌కాల‌లో మునిగి తేలుతోంది. గేమ్ ఆడ‌డానికి వ‌చ్చిన ప్రియాంక ఇలా చేయ‌డంపై నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. ఈ వారం ఆమెని ఎలిమినేట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి