Bigg Boss 5 : ష‌ణ్ముఖ్‌కి బిగ్ బాస్ గేమ్ గురించి ముందే తెలుసు.. లోబో ఆస‌క్తిక‌ర కామెంట్స్..

November 1, 2021 11:20 PM

Bigg Boss 5 : బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ 5 లోకి అనూహ్యంగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన కంటెస్టెంట్‌ లోబో. వాస్తవానికి అయితే గత సీజన్ లోనే లోబో బిగ్‌‌బాస్ లోకి అడుగుపెట్టాల్సింది. కానీ అప్పుడు ఆ అవకాశం మిస్ అవ్వగా ఈ సారి దక్కింది. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో భిన్నంగా క‌నిపించే లోబో మాట్లాడ‌డం కూడా కాస్త డిఫరెంట్‌గా మాట్లాడ‌తాడు. లోబో పక్కా హైదరాబాదీ కావడం అందరినీ ఇంకాస్త దగ్గరికి చేసింది.

Bigg Boss 5 lobo comments on shanmukh about bigg boss game

స్కూల్ టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్‌ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి అతనికి లోబో అనే పేరు పెట్టేసింది. దీంతో అప్పటినుంచి మహమ్మద్‌ ఖయ్యూం కాస్తా లోబోగా మారిపోయాడు.

బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన లోబో అరియానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ బజ్‌’లో పాల్గొన్నారు. ఇందులో ఇంటి స‌భ్యుల గురించి త‌న అభిప్రాయాలు చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో కాజల్‌ ఎంతో మంచి వ్యక్తి. ఆమె గేమ్‌ బాగా ఆడుతుంది’’ అని లోబో సమాధానమిచ్చాడు.

సిరి అన్ని చేసేసి ఏదైనా తప్పు జరిగితే హౌస్‌మేట్స్‌ అందరిపై కేకలు వేస్తుందని లోబో అన్నాడు. ఇక, షణ్ముఖ్‌ గురించి చెబుతూ.. ‘‘షణ్ముఖ్‌కి ఓ విభిన్నమైన వ్యవహార శైలి ఉంది. ఆయనకు గేమ్‌ మొత్తం ముందే తెలుసు’ అన్నాడు. మ‌రి పూర్తి ఎపిసోడ్‌లో ఏం చెబుతాడా.. అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment