Bigg Boss 5 : ప్రియ ఇంటి పెళ్లి వేడుక‌..స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జెస్సీ, ఉమాదేవి, సరయు..

November 22, 2021 9:25 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా ఫ్రెండ్లీగా క‌లిసిపోతూ స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతలా కొట్టుకున్నా.. ఇక్కడ ఎలిమినేట్ అయిన తరువాత ఇంటి సభ్యులంతా బయట మాత్రం కలిసి సందడి చేస్తున్నారు. గెట్ టు గెదర్ పేరుతో ఒకరిని ఒకరు కలుసుకుంటున్నారు. తాజాగా ఆర్టిస్ట్ ప్రియా ఇంట జరిగిన పెళ్లి వేడుకలో ప‌లువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.

Bigg Boss 5  jessy and uma devi and sarayu at priya house

నవంబర్‌ 21న ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు జెస్సీ, ఉమాదేవి, సరయు విచ్చేశారు. పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ‘మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ’ అంటూ ఇంటి ముందు ముగ్గులేసిన ఫొటోను ప్రియ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అంతకుమందు నటరాజ్ మాస్టర్ వైఫ్ సీమంతానికి కూడా.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. అక్కడ అంతా కలిసి సందడి చేశారు. ఇటీవల తండ్రి అయిన నటరాజ్ మాస్టర్ సైతం హౌస్ లో.. ఇతరులపై ఎప్పుడు మండిపడుతూ కనిపించే వారు. కానీ బయట ఇలా అందరితో నవ్వుతూ.. చాలా సరదాగా సందడి చేస్తున్నారు. ఇక అనారోగ్య స‌మస్య‌తో బయ‌ట‌కు వ‌చ్చిన జెస్సీఅయితే పిలిచిన ప్ర‌తి ఫంక్ష‌న్‌కి వెళుతూ చాలా ఉత్సాహంగా క‌నిపిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment