Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో ఎవరి అంచనాలకు అందకుండా అనీ మాస్టర్ ఇప్పటి వరకు ఇంట్లో కొనసాగింది. అయితే ఇప్పటి వరకు ఆమె హౌస్ లో ఎలిమినేట్ కాకుండా ఉండడమే చాలా గ్రేట్ అంటున్నారు. కానీ ఎట్టకేలకు ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. లీకు వీరుల ద్వారా ఈ సమాచారం అందుతోంది.
మొదట్నుంచీ అనీ మాస్టర్‌పై పెద్దగా అంచనాలు లేవు. అయినప్పటికీ ఆమె చాలా క్లెవర్‌గా గేమ్ ఆడుతూ వచ్చి ఇప్పటి వరకు షోలో కొనసాగింది. అయితే ఈ వారాంతం ఆమె ఎలిమినేట్ అయింది. ఆమెకు అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకనే ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది.
అనీ మాస్టర్ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ప్రస్తుతం కాజల్, మానస్, ప్రియాంక, రవి, షణ్ముఖ్, సిరి, శ్రీరామ చంద్ర, సన్నీ ఉన్నారు. ఇక రానున్న 2 వారాల్లో మరో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కానున్నారు.
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలేని డిసెంబర్ 19న నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఫినాలేకు చిరంజీవి లేదా మరే ఇతర స్టార్ హీరోనైనా ముఖ్య అతిథిగా తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టలేదు. ఇక ఫినాలే కూడా వచ్చేసింది. కనుక ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేనట్లేనని స్పష్టమవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…