Bigg Boss 5 : బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అనీ మాస్ట‌ర్‌

November 21, 2021 6:02 PM

Bigg Boss 5 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 లో ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా అనీ మాస్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్లో కొన‌సాగింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె హౌస్ లో ఎలిమినేట్ కాకుండా ఉండ‌డ‌మే చాలా గ్రేట్ అంటున్నారు. కానీ ఎట్ట‌కేల‌కు ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. లీకు వీరుల ద్వారా ఈ స‌మాచారం అందుతోంది.

Bigg Boss 5 anee master eliminated from house

మొద‌ట్నుంచీ అనీ మాస్ట‌ర్‌పై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. అయిన‌ప్ప‌టికీ ఆమె చాలా క్లెవ‌ర్‌గా గేమ్ ఆడుతూ వ‌చ్చి ఇప్ప‌టి వ‌ర‌కు షోలో కొన‌సాగింది. అయితే ఈ వారాంతం ఆమె ఎలిమినేట్ అయింది. ఆమెకు అందరిక‌న్నా త‌క్కువ ఓట్లు వ‌చ్చాయ‌ని, అందుక‌నే ఎలిమినేట్ అయింద‌ని తెలుస్తోంది.

అనీ మాస్ట‌ర్ ఎలిమినేష‌న్‌తో హౌస్‌లో ప్ర‌స్తుతం కాజ‌ల్‌, మాన‌స్‌, ప్రియాంక‌, ర‌వి, ష‌ణ్ముఖ్‌, సిరి, శ్రీ‌రామ చంద్ర‌, స‌న్నీ ఉన్నారు. ఇక రానున్న 2 వారాల్లో మ‌రో ఇద్ద‌రు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కానున్నారు.

ఇక బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 ఫినాలేని డిసెంబ‌ర్ 19న నిర్వ‌హిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఫినాలేకు చిరంజీవి లేదా మ‌రే ఇత‌ర స్టార్ హీరోనైనా ముఖ్య అతిథిగా తీసుకువ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈసారి ఇప్ప‌టి వ‌ర‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్ర‌వేశ‌పెట్టలేదు. ఇక ఫినాలే కూడా వ‌చ్చేసింది. క‌నుక ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేన‌ట్లేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment