Bhanu Priya : సీనియర్ నటి భానుప్రియ కెరీర్ ను నాశనం చేసిన ప్రముఖ నిర్మాత..!

October 23, 2021 12:50 PM

Bhanu Priya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ అందం, అభినయం, టాలెంట్ తో సక్సెస్ ని సాధించారు. ఇంకా సాధిస్తూనే ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రం ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. సీనియర్ యాక్టర్స్ లో ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ.. తన అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పేరును సంపాదించుకున్నారు.

Bhanu Priya career spoiled by one famous producer

తెలుగులో ఆమె నటించిన సినిమాలంటే ఎంతో మందికి అభిమానం. ముఖ్యంగా స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ యాక్టింగ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. అమాయకత్వం, అందం, తెలివితేటలు, అద్భుతమైన కళ ఇవన్నీ కలగలిపితే భానుప్రియ. ఈమె డాన్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవ్వకుండా ఉండలేరు. అలాంటి ఉత్తమమైన నటి కెరీర్ ను ఓ నిర్మాత నాశనం చేశారు.

భానుప్రియ అందాన్ని చూసి ఆ నిర్మాత తన సొంత బ్యానర్ లో ఆమెతో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ నిర్మాత దుర్బుద్దిని తెలుసుకున్న హీరోయిన్ భానుప్రియ మాత్రం అతని బ్యానర్లో సినిమా చేసేందుకు ఒప్పుకోలేదట. దీంతో ఆ నిర్మాత భానుప్రియపై, ఆమె కెరీర్ పై కోపం పెంచుకున్నారు. అందుకే ఆమె కెరీర్ ను ఎలాగైనా సరే నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి, అతనికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి భానుప్రియకు హీరోయిన్ గా ఎలాంటి అవకాశాలు రాకుండా మానసికంగా కృంగిపోయేలా చేశారు.

ఇప్పటికీ కూడా ఆ నిర్మాతకు ఎంతో పేరుందని భానుప్రియ అన్నారు. నిజానికి ఆ నిర్మాత కనుసైగల్లోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉందని చెప్పినా ఆశ్చర్యం లేదని అన్నారు. అలా భానుప్రియ.. ఆ నిర్మాత అనుకున్నట్లుగా తన సొంత బ్యానర్ లో సినిమా చేయలేదనే కారణంతోనే.. ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాకుండా చేశారని, తన ఎంటైర్ కెరీర్ ను నాశనం చేశారని అన్నారు. అయితే సీనియర్ యాక్టర్ గా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినా సరే ఆమెకు సరైన గుర్తింపు ఉన్న పాత్రలు రావడం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment