Beast Movie : బీస్ట్ ట్విట్ట‌ర్ రివ్యూ.. ఆడియ‌న్స్ అభిప్రాయం ఏమిటి ?

April 13, 2022 10:07 AM

Beast Movie : మాస్ట‌ర్ త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం బీస్ట్‌. కోలమావు కోకిల, డాక్టర్‌ చిత్రాలతో తమిళంలో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్‌ దిలీప్‌ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. పూజా హెగ్డె ఇందులో ఫస్ట్ టైమ్‌ విజయ్‌కి జోడీ కట్టింది. సినిమా రిలీజ్‌కి ముందే అనిరుధ్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఈ సినిమాలో విజయ్.. భారత రా ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతోపాటు హిందీలోనూ ఏక కాలంలో పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేశారు. తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో బీస్ట్ టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం రా అనే టైటిల్‌తో విడుదలైంది.

Beast Movie Twitter review what audience say
Beast Movie

ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియ‌ర్స్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. సినిమా విజ‌య్ వ‌ర్సెస్ టెర్ర‌రిస్ట్స్ అన్న నేప‌థ్యంలో రూపొందింద‌ని తెలుస్తోంది. ఓ షాపింగ్‌ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించారనేదే ఈ మూవీ కథ. ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుందని, విజయ్‌ తనదైన కామెడీతో నవ్వించాడని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిన అర‌బిక్ కుతు సాంగ్‌ థియేటర్లలో ప్రేక్షకులను ఈలలు వేయిస్తోందట.

ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంటుందని, సెకండాఫ్‌ అంతకంటే పడిపోయిందని, చాలా స్లోగా, బోరింగ్‌గా ఉందని అంటున్నారు. విజయ్‌ ఈ స్క్రిప్ట్ ఎంచుకుని మిస్టేక్స్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. కథ, కథనాలు అస్సలు బాగా లేవని, నెల్సన్‌ ఈ సారి డిజప్పాయింట్ చేశారని, సినిమాని సరిగా డీల్‌ చేయలేద‌ని అంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్ కూడా చాలా పూర్‌గా ఉన్నాయంటున్నారు. జెట్‌ సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు ట్విట్టర్‌ ఆడియెన్స్. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్, పాటలు సినిమాకి ప్లస్‌ అంటున్నారు. అయితే విజయ్‌ ఎంట్రీ సీన్‌ మాత్రం అదిరిపోతుందట. పూజా గ్లామర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని, మంచి కమర్షియల్‌ చిత్రమని అంటున్నారు. మొత్తంగా ట్విట్టర్‌ ఆడియ‌న్స్ నుంచి మాత్రం బీస్ట్ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment