ఓటీటీలో బీస్ట్ మూవీ.. ఎందులో అంటే..?

April 16, 2022 4:27 PM

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు న‌టించిన తాజా చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే విడుద‌లైన మొద‌టి రోజు నుంచే ఈ మూవీకి భారీ ఎత్తున నెగెటివ్ టాక్ వ‌చ్చింది. సాక్షాత్తూ విజ‌య్ అభిమానులే సినిమా బాగా లేద‌ని చెన్నైలో ఓ చోట ఏకంగా స్క్రీన్‌ను త‌గుల‌బెట్టారు. దీంతో సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. క‌నుక సన్ నెక్ట్స్ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

Beast movie to release on OTT know which platform

కాగా బీస్ట్ చిత్రం మ‌రీ పేల‌వంగా ఉంద‌ని చాలా చోట్ల కామెంట్స్ వినిపించాయి. అయితే భారీ ఎత్తున రిలీజ్ చేశారు క‌నుక పెట్టిన డ‌బ్బు వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైంది. కానీ ఒక్క చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ మంచి టాక్‌ను సాధించ‌లేక‌పోయింది. ఇక ఈ మూవీ ప్ర‌స్తుతం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. స‌న్ పిక్చ‌ర్స్‌కు చెందిన స‌న్ నెక్ట్స్ యాప్‌తోపాటు ప్ర‌ముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్‌లోనూ బీస్ట్ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన కార‌ణంగా చాలా త్వ‌ర‌గానే ఓటీటీలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన విడుద‌ల అయింది క‌నుక మే 13వ తేదీ త‌రువాతే వాస్తవానికి ఓటీటీలో రావాల్సి ఉంది. కానీ ఫ్లాప్ టాక్‌ను మూట గ‌ట్టుకుంది క‌నుక ఒక వారం ముందే.. అంటే.. మే 5 లేదా 6వ తేదీల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొద‌టి రోజుల్లోనే రూ.150 కోట్లు వ‌చ్చేశాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. కనుక నెగెటివ్ టాక్ వ‌చ్చినా.. లాస్ అనేది ఏర్ప‌డ‌లేద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment