Beast Movie : విజ‌య్‌, పూజా హెగ్డె బీస్ట్ మూవీ.. ఓటీటీ తేదీ వ‌చ్చేసింది..!

May 4, 2022 12:57 PM

Beast Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన‌ చిత్రం బీస్ట్.. ఏప్రిల్‌ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నచ్చలేదని విజయ్ ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్‌లో స్క్రీన్‌కి నిప్పు పెట్టారు. అయితే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్ కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్, స‌న్ నెక్ట్స్ ఈ చిత్రాన్ని మే 11 నుండి త‌మ ఫ్లాట్ ఫాంల‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్నాయి.

Beast Movie OTT date is here know it
Beast Movie

కాగా.. బీస్ట్ ఉగ్రవాద నేపథ్యంలో సాగే సినిమా. ఓ మాల్‌ను ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో.. అందులోనే ఉన్న హీరో విజయ్.. అక్కడి జనాలను ఎలా రక్షించాడనేదే కథ. విజయ్ నటన ఆకుట్టుకున్నప్పటికీ.. కథ, కథనాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టించిందని సినిమా చూసిన జనాలు అభిప్రాయపడుతున్నారు. బీస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

అయితే బీస్ట్ చిత్రం మాత్రం కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.వంద కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అయితే ఈ చిత్రం మిగతా అన్ని చోట్లా డిజాస్టర్‌గా మిగిలే అవకాశం ఉంది. పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. మరీ ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఇక సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకోవ‌డంతోపాటు.. కేజీయఫ్ చాప్టర్ 2 ప్రభంజనం ముందు కూడా వెలవెలబోయింది. బీస్ట్ కలెక్షన్లు ఘోరాతిఘోరంగా ఉన్నాయి. తమిళనాడులో సైతం విజయ్‌కి గట్టిపోటినిస్తూ యష్ వసూళ్లను రాబట్టాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment