Bandla Ganesh : ఇక ప‌వ‌న్‌తో అస‌లు సినిమాలు తీసేది లేదంటున్న బండ్ల గ‌ణేష్.. అస‌లు ఏం జ‌రిగింది..?

May 2, 2022 11:18 AM

Bandla Ganesh : న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడ‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప‌వ‌న్ భ‌క్తుడిగా చెప్పుకునే బండ్ల తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమాలు చేయ‌నంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఇది విని ఒక్క‌సారిగా ప‌వ‌న్ అభిమానులు షాక్ అయ్యారు. అయితే దాని వెనుక ఓ కార‌ణం ఉందంటూ చెప్పుకు రావ‌డంతో చ‌ల్ల‌బ‌డ్డారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గ‌ణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ ఓ వైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు నాలుగైదు సినిమాలు క‌మిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. వాటిని పూర్తి చేసుకుని నాకు అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాను.

Bandla Ganesh says he will not do movies with Pawan Kalyan
Bandla Ganesh

అయితే నా కోరిక ఏంటంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయ‌న త్వ‌ర‌గా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. వన్‌ కల్యాణ్‌ నన్ను నిర్మాత చేశారు. ఆయన అంటే ఇష్టం.. కానీ జనసేనలో చేరడంలాంటిది ఏమీ లేదన్న బండ్ల గణేష్‌.. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. నాకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అంటే గౌరవం.. ఆయనను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని.. అలాగే నేను ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అభిమానినే అని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ గురించి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గురించి నన్ను అడ‌గ‌కండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ‌. నా ఫ్యామిలీని ప్రేమించిన‌ట్లే వారిని ప్రేమిస్తాను.. అని కూడా స్ప‌ష్టం చేశారు బండ్ల‌.

ద‌ర్శ‌కుడితో గొడ‌వ‌పై కూడా స్పందించిన బండ్ల‌.. డైరెక్ట‌ర్‌తో గొడ‌వ‌లు అయి సినిమా ఆగిపోయింద‌నే వార్త‌ల్లో నిజం లేదు. నేను నాగార్జున సాగ‌ర్‌లాంటోడిని. నీళ్లు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడ‌దు. వాళ్లంద‌రూ ఆ టైపే. భ‌విష్య‌త్తులో హండ్రెడ్ ప‌ర్సెంట్ సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం అని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment