Balakrishna : బాల‌య్య.. లే.. అన‌గానే ఠ‌క్కున లేచి ఫొటో తీయించుకున్న చిన్నారి.. వీడియో వైర‌ల్‌..!

June 4, 2022 1:12 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ అంటే ఫ్యాన్స్ ఆయ‌న‌ను ఎంతో అభిమానిస్తారు. ఆయ‌న చూసేందుకు కోపిష్టిలా క‌నిపిస్తారు. అందువ‌ల్ల ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడాలంటేనే ఎవ‌రికైనా భ‌యం వేస్తుంది. ఇక హీరోయిన్ల సంగ‌తి స‌రేస‌రి. అందుక‌నే ఆయన తాజాగా చేస్తున్న ఎన్‌బీకే107 సినిమాలో ఆయ‌న ప‌క్క‌న న‌టించేందుకు శృతి హాస‌న్ భ‌య‌ప‌డింది. కానీ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని న‌చ్చ‌జెప్ప‌డంతో ఆమె ఎట్ట‌కేల‌కు బాల‌య్య ప‌క్క‌న న‌టించేందుకు ఒప్పుకుంది. అయితే బాల‌కృష్ణ అన్ని సంద‌ర్భాల్లోనూ కోపంగా ఉండ‌రు. కానీ ఆయ‌నకు న‌చ్చ‌ని ప‌నిచేస్తే మాత్రం ఎదుట ఎవ‌రు ఉన్నా వారి చెంప ప‌గులుతుంది. ఇలా గ‌తంలో అనేక సార్లు జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిని చూపిస్తుంటారు.

ఇక తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన హిందూపూర్‌లో ఓ కార్య‌క‌ర్త ఇంటి గృహ ప్ర‌వేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను చూసేందుకు ఫ్యాన్స్ అక్క‌డికి భారీగానే వ‌చ్చారు. అయితే ఓ కార్య‌క‌ర్త త‌న పాప‌తో క‌లిసి బాల‌య్య‌తో ఫొటో దిగేందుకు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాడు. అయితే పాప అప్ప‌టికే నిద్ర‌పోతోంది. దీంతో బాల‌య్య ఆ పాప‌ను త‌ట్టి లేపి.. లే.. ఫొటో దిగు.. అని గ‌ట్టిగా అన్నారు. దీంతో అక్క‌డ ఉన్న వారంతా న‌వ్వేశారు. త‌రువాత ఫొటో తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Balakrishna took a selfie with a kid viral video
Balakrishna

పాప నిద్ర‌లో ఉన్న‌ప్ప‌టికీ బాల‌య్య గొంతు విన‌బ‌డ‌గానే ఠ‌క్కున లేచి ఫొటోకు పోజు ఇచ్చింది. దీంతో బాల‌య్య‌నా.. మ‌జాకా.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. బాల‌య్య అంటే ఎవ‌రైనా అలా భ‌య‌ప‌డాల్సిందేన‌ని అంటున్నారు. ఫొటోల‌కు పోజులు ఇచ్చే విష‌యంలో తాను అసౌక‌ర్యానికి గురైతే బాలయ్య ఇలాగే చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అయితే ఇక్క‌డ పాప ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే త‌న అభిమాని చెంప మ‌రోసారి చెళ్లుమ‌నేది. అప్పుడు ఇంకా రాద్ధాంతం అయి ఉండేది. ఏది ఏమైనా.. ఫ్యాన్స్‌తో ఫొటోలు తీసుకోవ‌డంలో బాల‌య్య స్టైలే వేర‌ని చెప్ప‌వ‌చ్చు.

 

View this post on Instagram

 

A post shared by SARCASM (@sarcastc_us2.0)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment