Babu Gogineni : విశ్వక్‌సేన్ తో గొడవ పడడం ఏమోగానీ యాంకర్ దేవికి గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి. అప్పట్లో ఆమె న్యూస్ యాంకరింగ్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు. అయితే ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొని ఆమె అసలు జీవితం తెలిశాక ఆమెపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. కానీ నటుడు విశ్వక్‌సేన్‌పై గట్టిగా అరవడంతో మళ్లీ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యావత్ నెటిజన్ల లోకం దేవిదే తప్పంటూ ఘోషిస్తోంది. విశ్వక్‌కే మద్దతు పలుకుతోంది. అయితే ఈ వివాదంలోకి ప్రముఖ హేతువాది, విమర్శకులు బాబు గోగినేని కూడా ఎంటరయ్యారు. ఆయన దేవికి సంబంధించిన పాత వీడియోలను షేర్ చేస్తూ ఆమె పరువు మొత్తం తీస్తున్నారు.
గతంలో యాంకర్ దేవి ఓ వ్యక్తితో కలిసి ఓ పాటకు నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది. దీనికి బాబు గోగినేని లేటెస్ట్‌గా కౌంటర్ ఇచ్చారు. ఇలా రోడ్డు మీద పిచ్చి డ్యాన్స్ లు ఏంటి.. ట్రాఫిక్ జామ్‌లు అవుతాయి.. ఆంబులెన్స్‌లకు దారి ఇవ్వండి.. వీరిపై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేయండి.. పిచ్చి వేషాలు.. అంటూ దేవి వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు.
ఇక మరో వీడియోలో యాంకర్ దేవికి సైన్స్ పట్ల ఉన్న అవగాహన ఎంతో బాబు గోగినేని వివరించే ప్రయత్నం చేశారు. నీటికి విద్యుత్ శక్తి ఉంటుందని.. భూమికి గురుత్వాకరణ శక్తి ఉంటుందని.. ఇంత చిన్న విషయాలను తెలియకుండా ఆమె ఏదేదో న్యూటన్, ఐన్‌స్టీన్‌లకు అర్థం కాని భాష మాట్లాడుతుందని.. సెటైర్ వేశారు. ఈ క్రమంలోనే ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…