Babu Gogineni : దేవి నాగ‌వ‌ల్లి ప‌రువు మొత్తం తీస్తున్న బాబు గోగినేని.. రోడ్డుపై నువ్వు చేసిందేంటి.. వీడియో షేర్ చేసి మ‌రీ కౌంట‌ర్‌..!

May 6, 2022 4:02 PM

Babu Gogineni : విశ్వ‌క్‌సేన్ తో గొడ‌వ ప‌డ‌డం ఏమోగానీ యాంక‌ర్ దేవికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ట్రోల్స్ ఎదుర‌వుతున్నాయి. అప్ప‌ట్లో ఆమె న్యూస్ యాంక‌రింగ్‌పై నెటిజ‌న్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు. అయితే ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొని ఆమె అస‌లు జీవితం తెలిశాక ఆమెపై కాస్త సాఫ్ట్ కార్న‌ర్ ఏర్ప‌డింది. కానీ న‌టుడు విశ్వ‌క్‌సేన్‌పై గ‌ట్టిగా అర‌వ‌డంతో మ‌ళ్లీ ఆమెపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. యావ‌త్ నెటిజ‌న్ల లోకం దేవిదే త‌ప్పంటూ ఘోషిస్తోంది. విశ్వ‌క్‌కే మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. అయితే ఈ వివాదంలోకి ప్ర‌ముఖ హేతువాది, విమ‌ర్శ‌కులు బాబు గోగినేని కూడా ఎంట‌ర‌య్యారు. ఆయ‌న దేవికి సంబంధించిన పాత వీడియోల‌ను షేర్ చేస్తూ ఆమె ప‌రువు మొత్తం తీస్తున్నారు.

Babu Gogineni shared old videos of Anchor Devi Nagavalli
Babu Gogineni

గ‌తంలో యాంక‌ర్ దేవి ఓ వ్య‌క్తితో క‌లిసి ఓ పాట‌కు న‌డిరోడ్డుపై డ్యాన్స్ చేసింది. దీనికి బాబు గోగినేని లేటెస్ట్‌గా కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా రోడ్డు మీద పిచ్చి డ్యాన్స్ లు ఏంటి.. ట్రాఫిక్ జామ్‌లు అవుతాయి.. ఆంబులెన్స్‌ల‌కు దారి ఇవ్వండి.. వీరిపై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేయండి.. పిచ్చి వేషాలు.. అంటూ దేవి వీడియోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు.

https://www.facebook.com/SkillguruBabu/videos/2008061739402556/

ఇక మ‌రో వీడియోలో యాంక‌ర్ దేవికి సైన్స్ ప‌ట్ల ఉన్న అవ‌గాహ‌న ఎంతో బాబు గోగినేని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. నీటికి విద్యుత్ శ‌క్తి ఉంటుంద‌ని.. భూమికి గురుత్వాక‌ర‌ణ శ‌క్తి ఉంటుందని.. ఇంత చిన్న విష‌యాల‌ను తెలియ‌కుండా ఆమె ఏదేదో న్యూట‌న్‌, ఐన్‌స్టీన్‌ల‌కు అర్థం కాని భాష మాట్లాడుతుంద‌ని.. సెటైర్ వేశారు. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

https://www.facebook.com/100001583978925/videos/pcb.5292786234117457/1898283790358154

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now