Aha OTT : ఆహా ఓటీటీ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్.. 30 సినిమాలు విడుద‌ల‌..!

Aha OTT : క‌రోనా నేప‌థ్యంలో ఓటీటీల‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎక్కువైంది. చాలా వ‌ర‌కు సినిమాలు గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ఓటీటీల్లోనే విడుద‌ల కాగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఓటీటీల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌డం లేదు. కొత్త సినిమా విడుద‌ల‌య్యాక థియేట‌ర్ల క‌న్నా నెల రోజులు ఆగితే ఏకంగా ఓటీటీలోనే చూడ‌వ‌చ్చ‌ని చాలా మంది ప్రేక్ష‌కులు అనుకుంటున్నారు. క‌నుక టీవీల్లో సినిమాలు చూసే రోజులు కూడా పోయాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఓటీటీల్లోనే యాడ్స్ లేకుండా ఎంచ‌క్కా ప్రేక్ష‌కులు సినిమాల‌ను వీక్షిస్తున్నారు. అయితే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త‌మ ప్లాట్ ఫామ్‌లో త్వ‌ర‌లో30 సినిమాల‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Aha OTT

హాలీవుడ్ సినిమాల‌కు ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ల‌భిస్తోంది. హిందీ, త‌మిళం, మ‌ళ‌యాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీల‌ను డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆహా త‌న ప్లాట్‌ఫామ్‌పై 30 ఇంగ్లిష్ డ‌బ్బింగ్ మూవీల‌ను రానున్న రోజుల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. స‌ద‌రు మూవీల‌ను ప్ర‌తి శుక్ర‌వారం ఒక‌టి చొప్పున రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆహా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ సినిమాలు ప్ర‌తి శుక్ర‌వారం ఒక‌టి రిలీజ్ కానుండగా.. వాటిల్లో స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్ మూవీలు, మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ మూవీలు, సాల్ట్‌.. ఇత‌ర ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఆహా ఓటీటీ యాప్‌లో త్వ‌ర‌లో తెలుగు వెర్ష‌న్‌లో ల‌భ్యం కానున్నాయి. దీంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత వినోదం ల‌భ్యం కానుంది. అయితే ఈ మూవీల‌ను ఎప్పుడు రిలీజ్ చేసేది వెల్ల‌డించ‌లేదు. కానీ ఈ నెలాఖ‌రు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM