Chinna Jeeyar Swamy : చినజీయర్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వెధవ.. అశ్వినీదత్ వివాదాస్పద వ్యాఖ్యలు..

March 18, 2022 2:34 PM

Chinna Jeeyar Swamy : తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా ఉన్న సమ్మక్క-సారక్కల గురించి ఆధ్యాత్మికవేత్త చినజీయర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. చిన్న జీయర్ అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్కలను అవమాన పరుస్తున్నారని పెద్ద ఎత్తున తెలంగాణ గిరిజన నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతరగా పేరుగాంచిన సమ్మక్క సారక్కల గురించి చిన్న జీయర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ గిరిజన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Ashwani Dutt sensational comments on Chinna Jeeyar Swamy
Chinna Jeeyar Swamy

ఇక చిన్న జీయర్ సమ్మక్క సారక్క గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా దేవతలా బ్రహ్మ లోకం నుంచి దిగి వచ్చారా ? వారు కేవలం గ్రామదేవతలు మాత్రమే వారి పేర్లు చెప్పుకొని పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారని సమ్మక్క సారక్కల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పెద్దఎత్తున వివాదాలకు దారితీస్తోంది. ఇక ఈ వివాదంపై న్యూస్ ఛానల్స్ ఏకంగా డిబేట్ లు కూడా నిర్వహిస్తున్నాయి.

ఈ డిబేట్ లో భాగంగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ పాల్గొని చిన్న జీయర్ స్వామి గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. వాడు వీడు అంటూ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క సారక్కల పేరు చెప్పుకొని చేసేది వ్యాపారం అయితే సమతా మూర్తిని అడ్డుపెట్టుకొని మీరు చేసేది ఏంటి అంటూ ప్రశ్నించారు.

చిన్న జీయర్ ఒక పెద్ద ఎదవ. గతంలో వీడిపై బ్లాక్ టికెట్స్ అమ్ముకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. అంటూ న్యూస్ డిబేట్ లో పెద్ద ఎత్తున అశ్వినీదత్ చినజీయర్ గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడేమో ప్రార్థనలు చేస్తూ సూక్తులు చెబుతూ ఉంటాడు.. కానీ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ? అంటూ తీవ్ర స్థాయిలో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అశ్వినీ దత్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment