Aryan Khan : డ్రగ్స్ అండ్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాను కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిందితులు నేరం చేసినట్లు తమకు ఎలాంటి ప్రాథమిక సానుకూలమైన ఆధారాలు లభించలేదని కోర్టు పేర్కోంది. ముంబై కోర్ట్ ఆదేశాల తర్వాత సినీ నిర్మాత సంజయ్ గుప్తా ట్విట్టర్ లో స్పందించారు.
ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ నిర్దోషి అని బాంబే హైకోర్టు తెలిపింది. ఆయన, ఆయన కుటుంబం తీవ్ర మనస్తాపం చెందారని.. దాన్ని ఎవరు భర్తీ చేస్తారని అన్నారు. జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ ఒక ట్వీట్ లో గౌరీ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ.. వెరీ హ్యాపీ, దేవుడు చాలా గొప్పవాడు అంటూ ట్వీట్ చేశారు.
ఇక జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రేతో కలిసి సింగిల్ బెంచ్ అక్టోబర్ 25 న ఆర్యన్ ఖాన్, ఆయన స్నేషితులైన అర్భాజ్, మోడల్ మున్మున్ ధమేచాకు ఒక్కోక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల కాపీని శనివారం అందుబాటులో ఉంచారు. అలాగే ఆర్యన్ ఖాన్ ఫోన్ ను పరిశీలించాక, అతను ఆయన స్నేహితులు నేరానికి సంబంధించి, కుట్రపన్నారనేలా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
ఈ విధమైన ఉద్దేశ్యంతో నిందితులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని కోర్టును ఒప్పించే క్రమంలో ఎలాంటి ఆధారాలు రికార్డ్ లో లేవని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాదనను తోసిపుచ్చుతూ కోర్టు పేర్కొంది. అక్టోబర్ 3 వ తేదిన ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ ను, ఆయన స్నేహితుల్ని అరెస్ట్ చేశారు.
నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ చట్టంలో సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్యన్ జైలు నుండి అక్టోబర్ 30 న ఆర్థర్ రోడ్ జైలు నుండి బయటకు వచ్చారు. హైకోర్టు విధించిన షరతులతో.. ప్రతి శుక్రవారం సౌత్ ముంబైలో ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…