Squid Game : ప్రపంచం మొత్తం కోడై కూస్తున్న స్క్విడ్ గేమ్ సిరీస్‌.. ఏమిటిది ? పూర్తి వివ‌ర‌ణ‌..!

Squid Game : స్క్విడ్ గేమ్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున ఈ వెబ్ సిరీస్‌ను చూస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిత్యం ఈ సిరీస్‌కు చెందిన ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంది. అయితే.. ఇంత‌కీ.. ఏంటీ.. స్క్విడ్ గేమ్ సిరీస్‌. అంత‌గా ఇందులో ఏముంది ? అస‌లు ఇందులో క‌థ ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్క్విడ్ గేమ్‌.. వెబ్ సిరీస్‌ను ద‌క్షిణ కొరియాలో నిర్మించారు. ఆ దేశం వారిదే క‌నుక భాష కూడా కొరియ‌న్ ఉంటుంది. క‌నుక ఇత‌ర ప్రేక్ష‌కుల‌కు అర్థం కాదు. అయితే ఇంగ్లిష్ స‌బ్ టైటిల్స్‌తో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. క‌నుక ఇంగ్లిష్ అర్థ‌మ‌య్యేవారు ఈ సిరీస్‌ను చూడ‌వ‌చ్చు. ఇక అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే..

ఉద్యోగం కోల్పోయి.. ఎక్క‌డా ప‌ని దొరక్క‌.. భారీగా అప్పులు చేసి తీవ్రమైన ఆర్థిక స‌మ‌స్య‌లలో ఉన్న హీరో.. త‌ల్లి తెచ్చే డ‌బ్బుల‌పై ఆధార ప‌డి బ‌తుకుంటాడు. అక్క‌డితో ఆగితే బెట‌రే. కానీ అతనికి గుర్ర‌పు పందాలు అంటే మోజు. దీంతో త‌ల్లి పాకెట్ మ‌నీకి ఇచ్చే డ‌బ్బుల‌తోపాటు ఆమె ఇంట్లో దాచి పెట్టిన డ‌బ్బును వెతికి మ‌రీ గుర్ర‌పు పందాలు కాస్తుంటాడు. ఈ క్ర‌మంలో అప్పులు మ‌రింత ఎక్కువ‌వుతుంటాయి. కానీ వాటి నుంచి బ‌య‌ట ప‌డే మార్గం చేయ‌డు. మ‌రోవైపు అత‌ను ఈ విధంగా చేస్తున్నాడ‌ని.. అత‌ని భార్య అత‌నికి విడాకులు ఇచ్చి త‌మ కుమార్తెతో వేరేగా ఉంటుంది. ఆమె ఇంకో వ్య‌క్తిని పెళ్లి చేసుకుని అత‌నితో క‌లిసి అమెరికా వెళ్లే ప్లాన్ చేస్తుంటుంది.

ఇక హీరోలాగే డ‌బ్బు క‌ష్టాలు ఉండే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారంద‌రినీ ఒక దీవిలో చిన్న పిల్ల‌ల గేమ్స్ ఆడిస్తారు. సాధార‌ణంగా అయితే ఆ ఆట‌ల్లో ఔట్ అయిన వారు ప‌క్క‌కు త‌ప్పుకోవాలి. కానీ కొంద‌రు బ‌డాబాబులు ఆడించే ఆ చిన్న పిల్ల‌ల ఆట‌ల్లో ఔట్ అయితే చ‌నిపోవాల్సిందే. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారు. అలా వారు మొత్తం 6 గేమ్స్‌ను ఆడిస్తారు.

గేమ్స్ అన్నీ చిన్న పిల్ల‌లు ఆడుకునేవే అయిన‌ప్ప‌టికీ.. అందులో హార్ర‌ర్‌ను చొప్పించారు. ఆట‌లో ఔట్ అయితే ప‌క్క‌కు త‌ప్పుకోవాలి. కానీ అక్క‌డ ఆడే ఆట‌లో చ‌నిపోవాలి. ఎలిమినేట్ అయిన వారు చ‌నిపోతారు. వారిని కాల్చి చంపేస్తారు. ఇది ఆ ఆట‌లో ప్రాథ‌మిక రూల్‌. ఇక మొత్తం 6 ఆటలు ఆడిస్తారు. 6 రోజుల పాటు ఆట‌లు ఆడాలి. మొత్తం 456 మంది పాల్గొంటారు. 456 నంబ‌ర్ హీరోది. వారిని ఓ దీవికి మ‌త్తులో ఉంచి తీసుకెళ్తారు. ఆ దీవి ఎక్క‌డ ఉందో ఎవ‌రికీ తెలియ‌దు.

అలా ఆ దీవిలో అన్ని గేమ్స్‌ను ఆడి గెలిచిన వారు విజేత అయిన‌ట్లు లెక్క‌. వారికి కొన్ని కోట్ల రూపాయ‌ల సొమ్ము వ‌స్తుంది. స్క్విడ్ గేమ్ క‌థ ఇదే.

అయితే 456 మంది ఆడిన గేమ్‌లో ఎంత మంది మిగిలారు ? ఏం జ‌రిగింది ? గేమ్‌ల‌ను ఎలా ఆడారు ? హీరో ఎలా విజ‌యం సాధించాడు ? చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? అస‌లు చిన్న పిల్ల‌ల గేమ్స్ పేరు చెప్పి డ‌బ్బు క‌ష్టాల్లో ఉన్న వారిని తెచ్చి వారిచే గేమ్స్ ఆడించి ఓడిన వాళ్ల‌ను ఎందుకు కాల్చి చంపేస్తారు ? దీని వెనుక అస‌లు సూత్ర‌ధారి ఎవ‌రు ? ఎందుక‌లా చేశారు ? వంటి వివ‌రాల‌న్నింటినీ తెలుసుకోవాలంటే.. ఈ సిరీస్‌ను చూడాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ స్క్విడ్ గేమ్ సిరీస్‌ను ఇంగ్లిష్ స‌బ్ టైటిల్స్‌తో చూడ‌వ‌చ్చు. అయితే ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను 9 భార‌తీయ భాష‌ల్లోకి అనువదిస్తున్న‌ట్లు చెప్పింది. అంటే.. కొంత‌కాలం ఓపిక‌ప‌డితే దీన్ని తెలుగులోనూ చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌. అంత‌వ‌ర‌కు ఆగ‌లేం.. స‌స్పెన్స్‌గా ఉంది.. అనుకున్న వారు వెంట‌నే ఈ సిరీస్ ను చూడ‌వ‌చ్చు. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక‌టే సీజ‌న్‌. రెండో సీజ‌న్‌పై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. సో.. ఒక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హార్ర‌ర్ సిరీస్‌ను ఎంజాయ్ చేయాలంటే.. స్క్విడ్ గేమ్ సిరీస్‌ను చూడాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ‌గా సాగుతూ థ్రిల్‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఇక చివ‌రిగా ఇంకో మాట‌.. మ‌ధ్య మ‌ధ్య‌లో ఒక‌టి రెండు చోట్ల కొన్ని స‌న్నివేశాలు వ‌స్తాయి. క‌నుక ఈ సిరీస్ ను ఫోన్‌లోనో, లేదా ఇంట్లో టీవీలో అయితే ఎవ‌రూ లేన‌ప్పుడో చూడ‌డం బెట‌ర్‌. అది ఫ్యామిలీ ఉన్న‌వాళ్ల‌కు. లేని వాళ్లు ఎలాగైనా చూసేయండి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM