Aryan Khan : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కోర్టు మూడు సార్లు బెయిల్ ను తిరస్కరించగా నాలుగో సారి ముంబై కోర్టులో బెయిల్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను ముంబై హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఆర్యన్, అర్బాజ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. మరోసారి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మెజిస్ట్రేట్ కోర్ట్,సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆర్యన్ ఖాన్ తరఫు వాదనలు వినిపించేందుకు భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.
ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, విదేశాలకు పారిపోయే అవకాశముందని ఎన్సీబీ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. షారూఖ్ మేనేజర్ పూజా దడ్లాని సాక్ష్యులను తమ వైపు తిప్పుకుంటున్నారని ఎన్సీబీ అఫిడవిట్‌లో పేర్కొంది. డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్సీబీ. మరోవైపు క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అవిన్ సాహు, మనీష్‌లకు బెయిల్ దొరికింది. ఆర్యన్‌కి ఎప్పుడు బెయిల్ దొరుకుతుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…