Lenovo Tab K10 : లెనోవో సంస్థ ట్యాబ్ కె10 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో 10.3 ఇంచుల సైజ్ ఉన్న ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేకంగా ఐ కేర్ మోడ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో కళ్లపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
ఈ ట్యాబ్‌లో 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22టి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ 12 కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
ఈ ట్యాబ్‌కు వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. డాల్బీ ఆడియో ఫీచర్‌ను ఈ ట్యాబ్‌లో పొందవచ్చు. 4జీ ఎల్‌టీఈ, వైఫై ఆప్షన్లలో ఈ ట్యాబ్ లభిస్తోంది. ఇందులో బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 7500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను అందిస్తున్నారు.
లెనోవో ట్యాబ్ కె10 ట్యాబ్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఎల్‌టీఈ వెర్షన్ ధర రూ.13,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వైఫై వెర్షన్ ధర రూ.15,999గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఎల్‌టీఈ వెర్షన్ ధర రూ.16,999గా ఉంది. ఈ ట్యాబ్‌ను అమెజాన్, లెనోవో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్ లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…