Aryan Khan : ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ వ‌చ్చేనా ? ఎన్నాళ్లీ ఎదురు చూపులు..?

October 26, 2021 11:24 PM

Aryan Khan : ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్ కేసు రోజుకొక మ‌లుపు తిరుగుతోంది. ఇప్పటికే కోర్టు మూడు సార్లు బెయిల్ ను తిరస్కరించగా నాలుగో సారి ముంబై కోర్టులో బెయిల్ వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ పిటిషన్‌ను ముంబై హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Aryan Khan is awaiting from so many days for bail

ఆర్యన్, అర్బాజ్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. మరోసారి బుధ‌వారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. మెజిస్ట్రేట్ కోర్ట్,సెషన్స్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత ఆర్యన్ ఖాన్ తరఫు వాదనలు వినిపించేందుకు భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.

ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, విదేశాలకు పారిపోయే అవకాశముందని ఎన్సీబీ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. షారూఖ్‌ మేనేజర్‌ పూజా దడ్లాని సాక్ష్యులను తమ వైపు తిప్పుకుంటున్నారని ఎన్సీబీ అఫిడవిట్‌లో పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఎన్సీబీ. మరోవైపు క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అవిన్ సాహు, మనీష్‌లకు బెయిల్‌ దొరికింది. ఆర్య‌న్‌కి ఎప్పుడు బెయిల్ దొరుకుతుందా.. అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now