Anushka Malhotra : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫేమస్ చిత్రాలలో డాడీ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు. యావరేజ్ అయినా కూడా చిరంజీవి అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం బాగా నచ్చేసింది డాడీ సినిమా. ఇక అందులో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో యాక్టర్ చిన్నారి పాప. అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప. ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. చూస్తుండగానే డాడీ సినిమా వచ్చి 20 ఏళ్లు కావొస్తోంది. డాడీ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా కూడా పలు కారణాల వలన ఆమె గుడ్ బై చెప్పింది.
డాడీ సినిమాలో చిరంజీవి తర్వాత అంతగా ఆకట్టుకున్న మరో యాక్టర్ ఆ పాప. అక్షయ పాత్రకు ప్రాణం పోసింది ఈ పాప. ద్విపాత్రాభినయం చేసిన ఈ చిన్నారికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ రేంజ్‌లో మారిపోయింది. తన పేరు అనుష్క మల్హోత్రా. తెలుగమ్మాయి కాకపోయినా కూడా డాడీలో చిరుతో కలిసి అద్భుతమైన నటనను ప్రదర్శించింది అనుష్క. అచ్చంగా తండ్రీ కూతుళ్లే అనిపించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు కూడా ఈ పాప పేరు తెలుగులో మార్మోగిపోయింది. కానీ ఎందుకో మరి డాడీ తర్వాత స్క్రీన్‌పై పెద్దగా కనిపించలేదు.
ఈ సినిమాలో చిరంజీవికి దీటుగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో అదరగొట్టింది. ముఖ్యంగా అనుష్క మల్హోత్రా నీలి రంగు కళ్లతో అమాయకత్వంతో చెప్పే మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. డాడీ సినిమాలోని గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అనే పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. పుట్టిన రోజు వచ్చిందంటే ఇదే పాటను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టి వీడియోలను పెడుతుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ కూడా కుళ్లుకునేంత అందంగా మారిపోయింది చిన్నారి. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే దర్శనమిస్తున్నాయి. సినిమాలకు దూరంగా తన పని తాను చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే భవిష్యత్తులోనైనా సినిమాల్లోకి వస్తుందా.. రాదా.. అన్నది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…