DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని.. అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమాను.. అందులోని మాటలను, పాటలను మర్చిపోలేకపోతున్నారు.
ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా డీజే టిల్లు-2పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అనుమప పరమేశ్వరన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది ఈ మలయాళ బ్యూటీ. తాజాగా కార్తికేయ 2 మూవీలో నిఖిల్ సిద్దార్థ్ సరసన హీరోయిన్‌గా నటించింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుపమ కెరీర్ లో మరో హిట్ బొమ్మ ఈ అమ్మడి ఖాతాలో చేరినట్లైంది. అలాగే ప్రస్తుతం నిఖిల్‌తోనే కలిసి 18 పేజెస్ మూవీ చేస్తోంది అనుపమ. దీనికి సూర్య ప్రతాప్ డైరెక్టర్ కాగా బన్నీ వాస్ ప్రొడ్యూసర్. ఈ క్రమంలోనే అనుపమకు ఈ ఏడాది లక్ కలసి వచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…