Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మళయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనుపమ. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. ఆంధ్రలో వరదలు.. అనుపమ నా మరదలు.. అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు.
గత కొంతకాలంగా సరైన హిట్లు లేని అనుకి లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2తో సరైన టైంలో సూపర్ హిట్ పడింది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ, నిఖిల్ జోడీగా నటించారు. కార్తికేయ 2 సక్సెస్ ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుపమ మాట్లాడుతూ.. చందూ గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. కార్తికేయ 2లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ మూవీ కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్నిచోట్ల హీరోను డామినేట్ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో నిజం లేదు. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. అలాగే రౌడీ బాయ్స్‌లో కథ డిమాండ్ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను అని తెలిపింది అనుపమ.
బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్‌గా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించనుందని వార్తలొస్తున్నాయి. నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమను తీసుకోనున్నారని టాక్. ఇప్పటికే అనుపమ మూవీ కోసం అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది డీజే టిల్లుని మించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…