గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anupama Parameswaran : ఆ ముద్దు సీన్‌లో న‌టించ‌డంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన అనుప‌మ‌.. ఏమ‌న్న‌దంటే..?

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది…

Anupama Parameswaran : ఆ ముద్దు సీన్‌లో న‌టించ‌డంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన అనుప‌మ‌.. ఏమ‌న్న‌దంటే..?

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనుపమ. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. ఆంధ్రలో వరదలు.. అనుపమ నా మరదలు.. అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు.

గత కొంతకాలంగా సరైన హిట్లు లేని అనుకి లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2తో సరైన టైంలో సూపర్ హిట్ పడింది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ, నిఖిల్ జోడీగా నటించారు. కార్తికేయ 2 స‌క్సెస్‌ ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అనుప‌మ మాట్లాడుతూ.. చందూ గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. కార్తికేయ 2లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ మూవీ కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్నిచోట్ల హీరోను డామినేట్‌ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో నిజం లేదు. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. అలాగే రౌడీ బాయ్స్‌లో కథ డిమాండ్‌ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను అని తెలిపింది అనుపమ.

Anupama Parameswaran finally responded on her scene
Anupama Parameswaran

బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్‌గా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించనుందని వార్తలొస్తున్నాయి. నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమను తీసుకోనున్నారని టాక్. ఇప్పటికే అనుపమ మూవీ కోసం అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇది డీజే టిల్లుని మించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి