Viral Photo : చిన్ని కృష్ణుడి గెటప్ లో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

September 8, 2022 5:24 PM

Viral Photo : ఒక హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు. వాళ్ల అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను మెప్పించినప్పుడు మాత్మే వాళ్లకి మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నటీనటులు చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి.  అభిమాన తారల చిన్ననాటి ఫోటోల‌ను చూడడానికి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈమె తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.

తెలుగులో చేసిన చిత్రాలు తక్కువే అయినా..  ఈమెకు కుర్రాళ్ళలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా చిన్నికృష్ణుడి గెటప్ లో ఉన్న ఆ చిన్నారి ఇంకెవరో కాదు మలయాళం ప్రేమమ్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యూట్ భామ అనుపమ పరమేశ్వరన్. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అ..ఆ.. చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. సమంత వంటి స్టార్ హీరోయిన్ కి దీటుగా నాగవల్లి క్యారెక్టర్లో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

have you identified anupama parameswaran in this Viral Photo
Viral Photo

అ..ఆ.. చిత్రంలో అనుపమ గ్లామరస్ లుక్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్లు అనుపమ చెంతకు చేరాయి. తెలుగులో వచ్చిన ప్రేమమ్ చిత్రంలో కూడా అనుపమ పరమేశ్వరన్ ఒక క్యారెక్టర్ చేసింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బిజీగా దూసుకుపోయింది. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ 2 చిత్రంలో హీరో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దాదాపు 12 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అంటే అనుపమకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు. తనకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇదే క్రమంలో అనుపమ తన చిన్ననాటి కృష్ణుడి గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now