Anupama Parameswaran : వాట్స‌ప్ నంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌.. దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..!

April 19, 2022 9:51 AM

Anupama Parameswaran : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక జ‌నాలు అందులో ఎక్కువ‌గా కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల‌లో వారు ఎక్కువ‌గా విహ‌రిస్తున్నారు. అందుక‌నే సెల‌బ్రిటీలు కూడా సోష‌ల్ మీడియాలో ఖాతాల‌ను తెరుస్తూ త‌మ అభిమానుల‌కు రోజూ ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. అలాగే రోజు రోజుకీ ఫాలోవ‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంటున్నారు. ఇక వారు అప్పుడ‌ప్పుడు త‌మ ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియాలో లైవ్‌లో ముచ్చ‌టిస్తున్నారు. వారు అడిగే అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెబుతున్నారు. తాజాగా ఇలాగే న‌టి అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ కూడా త‌న ఫ్యాన్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చ‌టించింది. వారు అడిగిన అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజ‌న్ మాత్రం ఓ వింత ప్ర‌శ్న అడిగాడు.

Anupama Parameswaran replied to a netizen who asked her whatsapp number
Anupama Parameswaran

ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వ‌చ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను చాలా మంది ఫ్యాన్స్ అనేక ప్ర‌శ్న‌లు అడిగారు. ఇక ఓ నెటిజ‌న్ మాత్రం ఏకంగా అనుప‌మ‌కు చెందిన వాట్స‌ప్ నంబ‌ర్‌ను అడిగాడు. అయితే ఇందుకు అనుప‌మ రిప్లై ఇచ్చింది. వాట్సాప్ నంబ‌ర్ నాట్ ఫౌండ్‌.. అంటే కనిపించ‌డం లేదు.. అని స‌మాధానం ఇచ్చింది. దీంతో ఆ నెటిజ‌న్‌కు దిమ్మ తిరిగిపోయింది. ఇక అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌లో ఎంతో బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు ఇత‌ర హీరోయిన్ల‌ల‌లాగే గ్లామ‌ర్ షోకు తెర‌లేపింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన ఈమె చిత్రం.. రౌడీ బాయ్స్‌లో ఆమె ఏకంగా లిప్‌లాక్‌తో షాక్‌కు గురి చేసింది.

ఇక అనుప‌మ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆమె 18 పేజెస్‌, కార్తికేయ 2, బ‌ట‌ర్ ఫ్లై అనే మూడు తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉంది. ఇవి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now