Anubhavinchu Raja Movie Review : ఈ వారం ప్రేక్షకులని అలరించేందుకు థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రం అనుభవించు రాజా. ఇందులో రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి, ఆడుకలం నరేన్, అజయ్, రవి కృష్ణ, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియానా ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించారు. హిట్స్ లేక బాధపడుతున్న రాజ్ తరుణ్‌కి ఈ సినిమా విజయాన్ని అందించిందా.. లేదా.. అన్నది చూద్దాం.
హైదరాబాద్ లో ఓ సెక్యూరిటీ గార్డ్ గా రాజు (రాజ్ తరుణ్) చిన్నపాటి ఉద్యోగం చేస్తూ బ్రతుకుతాడు. ఈ సమయంలోనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన హీరోయిన్ కాశీష్ ఖాన్ తో ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడ నుంచి తన లైఫ్ లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి ? అతడిని చంపే వరకు పరిస్థితులు ఎలా మారుతాయి ? అనేది వెండితెరపై చూడాల్సిందే.
కామెడీని ఇష్టపడే వారికి చిత్రం బాగానే నచ్చుతుంది. రాజ్ తరుణ్ సినిమాలో నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. సెక్యూరిటీ గార్డుగా పల్లెటూరులో సరదా యువకుడిగా సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు. ఇక హీరోయిన్ కాశీష్ ఖాన్ లుక్స్ కానీ, డైలాగ్ డెలివరీ, నడవడిక అంతా నీట్ గా కనిపించాయి. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. సుదర్శన్ కామెడీ బాగుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఫర్వాలేదు అనిపించినా తర్వాత కనిపించే భాగం అంతా కాస్త సంబంధ రాహిత్యంగా అనిపిస్తుంది. ఒక సరైన ఫ్లో లేకుండా విలేజ్ డ్రామాలోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త ఎక్కువ గానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంకో పెద్ద మైనస్ ఏమిటంటే క్యాస్టింగ్ పరంగా లోపం కనిపిస్తుంది.
రవి, అరియనా లాంటి వాళ్ళని పెట్టుకున్నా వాళ్లకి డిజైన్ చేసిన పాత్రలు, వాటి ఎమోషన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం. అలాగే రాజ్ తరుణ్, అజయ్ ల మధ్య ఎపిసోడ్స్ కూడా ఏమంత ప్రభావవంతంగా అనిపించవు. రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించి డీటెయిల్స్ కూడా అంత అర్ధవంతంగా ఉండవు. చిత్రంలో నిర్మాతల నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి. గోపి సుందర్ ఇచ్చిన స్కోర్ కానీ, పాటలు కానీ ఆకట్టుకుంటాయి.
“అనుభవించు రాజా” అక్కడక్కడా నవ్వుకోడానికి బాగానే ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోవడం, సరైన ఎమోషన్స్ లోపం.. వంటివి నిరాశపరుస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు ఫర్వాలేదు, కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…